మేం ఎవరి జోలికి వెళ్లం: ఈటల
ABN , First Publish Date - 2021-06-23T03:02:51+05:30 IST
తాము ఎవరి జోలికి వెళ్లబోమని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు

కరీంనగర్: తాము ఎవరి జోలికి వెళ్లబోమని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. 20 ఏళ్లలో ఎప్పుడూ గొడవలకు తావు ఇవ్వలేదన్నారు. కుల సంఘాల మీటింగులు పెట్టి, అంగట్లో మాదిరిగా అందరినీ కొంటున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు అంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఐఏఎస్ లాంటి అధికారులను కూడా బానిసలుగా కేసీఆర్ చేసుకున్నారని ఆయన విమర్శించారు. ఎవరో పెట్టిన చీమల పుట్టలోకి ఈటెల వచ్చాడని ఒకరు అంటున్నారని, చీమల పుట్ట నేను పెట్టానా, నువ్వు పెట్టావా నా కొడకా..అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.