Share News

Kalpana Daughter: అసలు విషయం చెప్పేసిన కల్పన కూతురు..

ABN , Publish Date - Mar 05 , 2025 | 01:34 PM

Kalpana Daughter Reaction: కూతురు వల్లే సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుందా.. అసలెందుకు కల్పన నిద్రమాత్రలు అధికంగా మింగేసింది.. కుటంబంలో ఏవైనా గొడవలు ఉన్నాయా.. కూతురితో విభేదాలున్నాయా.. కల్పన ఆత్మహత్యాయత్నంపై ఆమె కూతురు స్పందించిందా.. స్పందిస్తే ఏమంటోంది.. అసలు కల్పన కుటుంబంలో ఏం జరుగుతోంది.. పూర్తి వివరాలు మీకోసం..

Kalpana Daughter: అసలు విషయం చెప్పేసిన కల్పన కూతురు..
Singer Kalpana

హైదరాబాద్, మార్చి 05: తన కూతురు వల్లే సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ ప్రచారం జరుగుతోంది. తన కూతురు తన మాట వినలేదనే కారణంగా మనస్తాపానికి గురైన కల్పన.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ప్రచారాలు, వార్తలపై కల్పన కూతురు తొలిసారి రియాక్ట్ అయ్యింది. కల్పన ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న ఆమె కూతురు.. హుటాహుటిన కేరళ నుంచి హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా పోలీసులు ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. మరి పోలీసులకు కల్పన కూతురు ఏం చెప్పింది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.


కల్పన కూతురు స్టేట్‌మెంట్ ఇదే..

కల్పన ఆత్మహత్యాయత్నంపై ఆమె కూతురు స్పందించింది. తన తల్లి కల్పన ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలిపింది. నిద్రమాత్రలు ఓవర్ డోస్ వేసుకుందన్నారు. డాక్టర్ సూచించిన నిద్రమాత్రలే వేసుకుందని వివరించింది. మానసిక ప్రశాంతత కోసం నిద్రమాత్రలు వేసుకుంటోందని కల్పన కూతురు తెలిపింది. తమ కుటుంబంలో ఎలాంటి సమస్యా లేదన్నారు. తన తల్లి కల్పన హైదరాబాద్‌లో లా పీజీ చేస్తోందని వివరించింది. కల్పన మానసిక ఒత్తిడికి గురవుతూ, నిద్రలేమి సమస్యతో బాధపడేదని పేర్కొంది.


పోలీసులు ఏం చెప్పారంటే..

కల్పన పెద్ద కూతురు స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. అంతకుముందు.. కేరళ నుంచి హైదరాబాద్ రమ్మంటే కూతురు రావడం లేదని కల్పన మనస్థాపనం చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేరళ వెళ్లిన సందర్భంలో కూడా ఈ విషయంపై ఇరువురి మధ్య గొడవలు జరిగాయట. హైదరాబాద్‌కి వచ్చిన తరువాత మరోసారి కూతురుని తన వద్దకు రావాలని కల్పన కోరిందట. అయినప్పటికీ ఆమె అంగీకరించలేద. దీంతో తన కూతురు తన మాట వినడం లేదని కల్పన మనస్తాపానికి గురైందని, అలా నిద్ర మాత్రలు వేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కల్పన మొదటి భర్త కూతురు కేరళలో చదువుతోంది. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చేయాలని కల్పన ఆమెను అనేకసార్లు కోరింది. ఈ విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.


Also Read:

డ్రిల్ బేబీ డ్రిల్.. ద్రవ్యోల్బణాన్ని ఓడిద్దాం..

శిరీష మృతి కేసులో విస్తుపోయే విషయాలు..

For More Telangana News and Telugu News..

Updated Date - Mar 05 , 2025 | 01:56 PM