నిన్ను చూడాలనిపిస్తోంది.. ఇంటికి రా బిడ్డా!

ABN , First Publish Date - 2021-07-03T06:24:03+05:30 IST

‘నిన్ను చూడాలనిపిస్తోంది.. అందరం కలిసి బతుకు దాం. ఒంటరిగా ఉండలేకపోతున్నా... ఇంటికి రా బిడ్డా..’ .అంటూ మావోయి స్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ను ఆమె తల్లి బతుకమ్మ...

నిన్ను చూడాలనిపిస్తోంది.. ఇంటికి రా బిడ్డా!
తల్లి బతుకమ్మతో మాట్లాడుతున్న ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌

 మావోయిస్టు నేత దామోదర్‌ తల్లి బతుకమ్మ  ఆవేదన

 అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌


ములుగు /మేడారం: ‘నిన్ను చూడాలనిపిస్తోంది.. అందరం కలిసి బతుకు దాం. ఒంటరిగా ఉండలేకపోతున్నా... ఇంటికి రా బిడ్డా..’ .అంటూ మావోయి స్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ను ఆమె తల్లి బతుకమ్మ కోరింది. శుక్రవారం  ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ అధికారులు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాల్వపల్లిలో ఉన్న దామోదర్‌ ఇంటికి వెళ్లి ఆయన తల్లి బతుకమ్మతో మా ట్లాడారు. పేదరికంలో ఉన్న ఆమె పరిస్థితిని తెలుసుకుని బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు.  ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో కంటి పరీక్షలు చేయించి కళ్లద్దాలు ఇప్పిస్తామని అన్నారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బతుకమ్మ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. అడవుల్లో ఉన్న మావోయిస్టులు చాలా మంది అనారోగ్యం పాలయ్యారని, వారంతా బయటకు వస్తే మెరుగైన వైద్యం అందజేస్తామని పేర్కొన్నారు. చాలా మంది మావోయిస్టులు ఒత్తిడితో అజ్ఞాతంలో కొనసాగుతున్నారని, ముఖ్య నేతలంతా అనారోగ్యంతో మరణిస్తున్నా కేంద్ర కమిటీ దాటవేత ధోరణిని ప్రదర్శిస్తోందని అన్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చి కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం గడిపితే ప్రభుత్వ పక్షాన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.  తిరుగు ప్రయాణంలో కాల్వపల్లికి చెందిన చిన్నారులకు ఎస్పీ మాస్కులు పంపిణీ చేశారు. శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు.  ఎస్పీ వెంట  ములుగు ఏఎస్పీ పోతరాజు సాయి చైతన్య, ఐపీఎస్‌ అధికారి చెన్నూరి రూపేష్‌, పస్రా సీఐ అనుముల శ్రీనివాస్‌, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్‌రావు, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-07-03T06:24:03+05:30 IST