గాడిదలపై కత్తితో దాడి
ABN , First Publish Date - 2021-07-29T19:08:41+05:30 IST
వికారాబాద్ జిల్లా: గాడిదలను చంపిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వికారాబాద్ జిల్లా: గాడిదలను చంపిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాడిదలు అరిచాయని చిరాకు చెందిన ఓ వ్యక్తి వాటిపై కత్తితో దాడి చేసి చంపేశాడు. వికారాబాద్ జిల్లా, కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 25న ఈ ఘటన చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా, మద్దూరు మండలం, రేణిపట్ల గ్రామానికి చెందిన వ్యక్తులు తమ గొర్రెలను మేపడానికి కుల్కచర్ల వచ్చారు. వారి సామాగ్రి మోయడానికి మూడు గాడిదలను వెంట తెచ్చుకున్నారు. చెరువుముందలి తండా ప్రాంతంలో కట్టేసి గొర్రెలను మేపడానికి వెళ్లారు. పక్క పొలంలో కృష్ణయ్య అనే రైతు ఉన్నాడు. గాడిదలు గట్టిగా అరిచాయని ఒక్కసారిగా కోపం పెంచుకున్నాడు. కట్టేసి ఉన్న గాడిదలపై కత్తితో దాడి చేశాడు. దీంతో రెండు గాడిదలు అక్కడిక్కడే చనిపోయాయి. మరో గాడిద తీవ్రంగా గాయపడింది.