బస్సును రోడ్డు పక్కన ఆపి.. స్టీరింగ్‌పై వాలిపోయి..

ABN , First Publish Date - 2022-10-29T03:06:19+05:30 IST

గుండెపోటుతో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు మృతి చెందిన ఘటన ఏర్పేడు మండలం మేర్లపాక వద్దకు శుక్రవారం జరిగింది.

బస్సును రోడ్డు పక్కన ఆపి..   స్టీరింగ్‌పై వాలిపోయి..
మృతి చెందిన చెంచుకృష్ణయ్

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

ఏర్పేడు, అక్టోబరు 28: గుండెపోటుతో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు మృతి చెందిన ఘటన ఏర్పేడు మండలం మేర్లపాక వద్దకు శుక్రవారం జరిగింది. ఏర్పేడు సమీపంలోని బాలకృష్ణాపురం గ్రామానికి చెందిన చెంచుకృష్ణయ్య(52) శ్రీకాళహస్తి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం శ్రీకాళహస్తి - తిరుపతి సర్వీసు నడపడానికి విధులకు హాజరయ్యాడు. తిరుపతిలో మధ్యాహ్నం మూడు గంటలకు బయల్దేరిన బస్సు ఏర్పేడు దాటి మేర్లపాక వద్దకు రాగానే చెంచుకృష్ణయ్య తీవ్రమైన గుండెనొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి స్టీరింగ్‌పై వాలిపోయాడు. ప్రయాణికులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న చెంచుకృష్ణయ్య భార్య శోభ, గ్రామస్తులు, ఏర్పేడు సీఐ శ్రీహరి, ఎస్‌ఐ రఫీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 వాహనంలో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డిపో మేనేజరు రాజవర్థన్‌రెడ్డి, కంట్రోలర్‌ వైడీ కుమార్‌, ఎంఎస్‌ మణి, కండక్టర్లు జేవీ రమణ, జీఎస్‌ మణి, బాలాజీ, సెక్యూరిటీ గార్డులు ఆస్పత్రికి చేరుకుని చెంచుకృష్ణయ్య మృతికి నివాళులర్పించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

========================

Updated Date - 2022-10-29T03:06:23+05:30 IST