హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరే ఉంచాలి

ABN , First Publish Date - 2022-11-06T03:35:06+05:30 IST

విజయవాడలోని హెల్త్‌ యూనివర్సీటీకి ఎన్టీఆర్‌ పేరునే కొనసాగించాలని కోరుతూ విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. దాదాపు 20 వేల పోస్టుకార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపిస్తున్నారు.

హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరే ఉంచాలి
Health University NTR

టీడీపీ పోస్టు కార్డుల ఉద్యమం

విజయనగరం రూరల్‌, నవంబరు 5: విజయవాడలోని హెల్త్‌ యూనివర్సీటీకి ఎన్టీఆర్‌ పేరునే కొనసాగించాలని కోరుతూ విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. దాదాపు 20 వేల పోస్టుకార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపిస్తున్నారు. ఈమేరకు శనివారం ఉదయం పార్టీ కార్యాలయంలో టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు సంతకాలతో కూడిన పోస్టుకార్డులను చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు మార్చడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఎప్పటి నుంచో హెల్త్‌ యూనివర్సీటీకి ఎన్టీఆర్‌ పేరు ఉందని, ఉన్నట్లుండి ఆ పేరును పాలకులు ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు. భోగాపురం విమానాశ్రయానికి టీడీపీ హయాంలోనే శంకుస్థాపన జరిగిందని, మళ్లీ ఇప్పుడు శంకుస్థాపన పేరిట హడావుడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు.

Updated Date - 2022-11-06T03:35:07+05:30 IST