నిండుకుండలా బాహుదా
ABN , First Publish Date - 2022-09-09T04:29:41+05:30 IST
బాహుదా నుంచి 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన్ ఏఈ శ్రీహరిరెడ్డి తెలిపారు.

400 క్యూసెక్కుల నీరు విడుదల
నిమ్మనపల్లె, సెప్టెంబరు 8: బాహుదా నుంచి 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన్ ఏఈ శ్రీహరిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ మదనపల్లె, ఇతర కాలువల నుంచి నీరు వచ్చి బాహుదా ప్రాజెక్టులో కలుస్తుండటంతో నిండుకుండలా మారిందన్నారు. దీంతో 400 క్యూసెక్కుల నీటిన దిగువకు వదిలామన్నారు. బాహుదా నది పరివాహక ప్రాంత ప్రజలు, సంబంధిత అఽధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా చేపలకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. స్థానిక పోలీసులు మాట్లాడుతూ అగ్రహారం వద్ద బ్రిడ్జి నిర్మాణంలో ఉందని అయితే అక్కడ వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్నట్లు తెలిపారు. అయితే ప్రజలు అప్రమత్తం కావాలని కోరారు.