Kadapa: ఆల్‌పార్టీ నేతలకు-పోలీసుల మధ్య తోపులాట.. ఉద్రిక్తత
ABN, First Publish Date - 2022-11-22T12:41:25+05:30
కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను వైసీపీ ఎమ్మెల్యే (ycp mla) ఆక్రమించారంటూ అఖిలపక్షం నేతలు
కడప: అఖిలపక్ష ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను వైసీపీ ఎమ్మెల్యే (ycp mla) ఆక్రమించారంటూ అఖిలపక్షం నేతలు ఆరోపించారు. నగర శివారులోని భావన టౌన్‌షిప్ దగ్గర ఆందోళన చేపట్టేందుకు ఆల్‌పార్టీ నేతలు పిలుపునిచ్చారు. అటువైపు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల అత్యుత్సాహంపై అఖిలపక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు-నేతల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. భూకబ్జాదారులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ నినాదాలు చేశారు. భావన టౌన్ షిప్‌లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని తక్షణమే ప్రభుత్వం(ycp government) స్వాధీనం చేసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-22T12:41:27+05:30 IST