మెరుగైన ధరతో పాడి రైతుల ఆర్థికాభివృద్ధి

ABN , First Publish Date - 2022-09-09T06:48:16+05:30 IST

పాడిరైతులకు మెరుగైన ధర అందించి, వారి ఆర్ధికాభివృద్ధికి దోహదపడటమే జగనన్న పాలవెల్లువ పథకం ముఖ్య ఉద్దేశ్యమని ఉంగుటూరు పశువైద్యాధికారి డాక్టర్‌ స్వర్ణలత అన్నారు.

మెరుగైన ధరతో పాడి రైతుల ఆర్థికాభివృద్ధి
మాట్లాడుతున్న పశువైద్యాధికారి డాక్టర్‌ స్వర్ణలత

మెరుగైన ధరతో పాడి రైతుల ఆర్థికాభివృద్ధి

పాలసేకరణ కేంద్రాల స్థితిగతులపై ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష

ఉంగుటూరు, సెప్టెంబరు 8 : పాడిరైతులకు మెరుగైన ధర అందించి, వారి ఆర్ధికాభివృద్ధికి దోహదపడటమే జగనన్న పాలవెల్లువ పథకం ముఖ్య ఉద్దేశ్యమని ఉంగుటూరు పశువైద్యాధికారి డాక్టర్‌ స్వర్ణలత అన్నారు. పాలసేకరణ కేంద్రాల ప్రస్తుత స్థితిగతులపై గురువారం ఎంపీడీవో కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ అమలుకు మండలంలో మానికొండ, చాగంటిపాడు, ఉంగుటూరు, పెదఅవుటపల్లి, వేంపాడు, తేలప్రోలు, ఆత్కూరు, ఇందుపల్లి, తరిగొప్పల గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెలాఖరు కల్లా ఆయా గ్రామాల్లో పాలసేకరణ కేంద్రాలను(ఏఎంసీయు)ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీడీవో జీఎస్‌వీ శేషగిరిరావు మాట్లాడుతూ ఎంపికచేయబడిన గ్రామాల్లోని పాలసేకరణ కేంద్రాల్లో విద్యుత్‌, ఎర్తింగ్‌, నెట్‌వర్క్‌ వంటి సదుపాయాల కల్పనపై దృష్టిసారించాలని సూచించారు.  పాలసేకరణ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రస్తుత స్థితిగతులు, సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించి ఈనెల 20లోగా సమర్పించాలని ఎంపీడీవో ఆదేశించారు. తేలప్రోలు పశువైద్యాధికారి డాక్టర్‌ చింతల మల్లిబాబు, పీఆర్‌ ఏఈ డి.బాబూరావు, వైఎస్సార్‌ క్రాంతిపథం(వెలుగు)ఏపీఎం, ఎం.సాంబశివరావు, సూపరింటెండెంట్‌ ఎన్‌, బసవయ్య, తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2022-09-09T06:48:16+05:30 IST