Pemmasani: గుంటూరు అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని కీలక నిర్ణయం
ABN , Publish Date - Mar 09 , 2025 | 02:06 PM
Pemmasani Chandrasekhar: గుంటూరు అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పెమ్మసాని చంద్రశేఖర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

గుంటూరు జిల్లా: గుంటూరు ప్రాంతానికి 100 ఎలక్ట్రానిక్ బస్సులు సాంక్షన్ అయ్యాయని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పీపీపీ పద్ధతిలో ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఇవాళ(ఆదివారం) గుంటూరులో అధికారులతో కలసి ఆర్టీసీ బస్టాండ్‌ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఎలక్ట్రానిక్ బస్సులు రావాలంటే 5 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కావాలని అన్నారు. 22 ఎకరాల్లో ఆర్టీసీ బస్టాండ్ విస్తరించి ఉందని వివరించారు. 15 ఎకరాలు బస్టాండ్ సమీపాన్ని ఆధునికీకరణ చేస్తామని అన్నారు. మిగతా 5 ఎకరాలు ఎలక్ట్రానిక్ బస్సుల కోసం ఉపయోగిస్తామని తెలిపారు. బస్టాండ్‌లో ఉన్న బస్సు గ్యారేజ్‌ని వేరే చోటుకు మార్చే ఆలోచన ఉందని చెప్పారు. బస్ స్టేషన్‌కు పేదవారు ఎక్కువగా వస్తారని అన్నారు. అలాంటి వారికి ఆధునికీకరణతో బస్టాండ్ ఉండేలా చేస్తామని చెప్పారు. బస్టాండ్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించేలా అధికారులు పని చేయాలని పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Anil Video: బోరుగడ్డ అనిల్ వీడియోపై పోలీసుల సీరియస్
Arasavelli: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ
Minister Ram Prasad : క్రీడాభివృద్ధికి సహకరించండి
Read Latest AP News and Telugu News