అంధకారంలో ఆదోని ఆసుపత్రి

ABN , First Publish Date - 2022-04-14T05:26:37+05:30 IST

ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బుధవారం రాత్రి చీకట్లు అలుముకున్నాయి.

అంధకారంలో ఆదోని ఆసుపత్రి
చీకట్లో ఆదోని ఏరియా ఆసుపత్రి

ఆదోని, ఏప్రిల్‌ 13: ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బుధవారం రాత్రి చీకట్లు అలుముకున్నాయి. విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో రోగులు ఇబ్బందులకు గురయ్యారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి అయినా విద్యుత సరఫరా కాలేదు. ఇటీవల కొత్త జనరేటర్‌ను సమకూర్చారు. అందులో ఫ్యూజ్‌ సమస్య తలెత్తడంతో కరెంట్‌ లేక ఆసుపత్రిలో అంధకారం అలుముకుంది. దీంతో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న 45 మంది రోగులు, వారి సహాయకులు 50 మంది ఇబ్బందులు పడ్డారు. విద్యుత వైర్లకు మరమ్మతులు చేసి సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.లింగన్న పేర్కొన్నారు. 

అంధకారంలో ఆలూరు

ఆలూరు: ఆలూరు పట్టణంలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి విద్యుత సరఫరా నిలిచిపోవడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు. మరో వైపు ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి విద్యుత సరఫరా నిలిచిపోయింది. దీంతో దోమలు, ఉక్కపోతకు రోగులు ఆసుపత్రి ఆవరణలో చెట్ల కిందకు చేరుకున్నారు. చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 



Updated Date - 2022-04-14T05:26:37+05:30 IST