PM Modi tour: విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు
ABN, First Publish Date - 2022-11-02T12:31:53+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 11, 12 తేదీలలో ప్రధాని నగరంలో పర్యటించనున్నారు.
విశాఖపట్నం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 11, 12 తేదీలలో ప్రధాని(Prime minister) నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను జిల్లా అధికారులు, ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasaireddy) పరిశీలించారు.
ఎంపీ విజయసాయి (YCP MP) మాట్లాడుతూ... 11, 12 తేదీల్లో ప్రధాన మంత్రి పర్యటన ఖరారైందని.. దీనిపై అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం పార్టీలకు సంబంధించింది కాదని ప్రభుత్వ కార్యక్రమమని స్పష్టం చేశారు. విస్తరణ ఉందని...రైల్వే జోన్‌కు సంబంధించి తెలియాల్సి ఉందని ఎంపీ విజయసాయి వెల్లడించారు.
కలెక్టర్ మల్లికార్జున (Mallikarjuna) మాట్లాడుతూ... విశాఖలో ప్రధానమంత్రి పర్యటన ఖరారైందని తెలిపారు. ఈనెల 11న ప్రధానమంత్రి రానున్నారని.. 12న జరిగే సభలో పాల్గొంటారని చెప్పారు. రూ.10,475 కోట్లు విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మొత్తం ఏడు కార్యక్రమాలకు షెడ్యూల్ ఖరారైనట్లు చెప్పారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు, ఉత్తరాంధ్రలో పలు కేంద్ర ప్రభుత్వ రోడ్లకు శంకుస్థాపనలు ఉంటాయన్నారు. మైదానంలో సుమారుగా 65 వేల నుంచి లక్ష మంది జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మల్లికార్జున (Visakha collector) తెలిపారు.
Updated Date - 2022-11-02T12:37:33+05:30 IST