మారుతి లాభం నాలుగింతలు
ABN , First Publish Date - 2022-10-29T00:36:24+05:30 IST
మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ)కి సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం బాగా కలిసివచ్చింది. అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగడంతో...
న్యూఢిల్లీ: మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ)కి సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం బాగా కలిసివచ్చింది. అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగడంతో రూ.2112.50 కోట్ల త్రైమాసిక లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక లాభం రూ.486.90 కోట్లతో పోల్చితే ఇది నాలుగు రెట్లు అధికం. ఇదే కాలంలో ఆదాయం రూ.20,550.90 కోట్ల నుంచి రూ.29,942.50 కోట్లకు పెరిగింది. జూలై-సెప్టెంబరు కాలంలో మొత్తం 5,17.395 వాహనాలు విక్రయించినట్టు కంపెనీ ప్రకటించింది. వీటిలో దేశీయంగా విక్రయించినవి 4,54,200 కాగా ఎగుమతి చేసినవి 63,195 యూనిట్లు. ఎలక్ర్టానిక్ విడిభాగాల కొరత కారణంగా త్రైమాసికంలో 35 వేల వాహనాలు తయారు చేయలేక పోయినట్టు కంపెనీ తెలిపింది. రెండో త్రైమాసికం ముగిసే నాటికి తమ వద్ద పెండిం గ్ ఆర్డర్ల సంఖ్య 4.12 లక్షలున్నట్టు మారుతి పేర్కొంది.