ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gadkari falls sick: గడ్కరీకి అస్వస్థత.. మోదీ ఆరా!

ABN, First Publish Date - 2022-11-17T15:16:08+05:30

కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అస్వస్థతకు గురయ్యారు.

Nitin Gadkari
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమబెంగాల్(West Bengal), సిలిగురి(Siliguri) లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్టేజ్‌పై ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కార్యక్రమాన్ని ఆపేసి ఆయన గ్రీన్ రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ కూడా ఆయన పరిస్థితి మెరుగుపడలేదు. షుగల్ లెవెల్స్ పడిపోయాయని అందుకే ఆయన అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. గడ్కరీ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) వాకబు చేశారు. ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (Chief Minister of West Bengal) మమతా బెనర్జీ (Mamata Banerjee) కూడా గడ్కరీ ఆరోగ్యంపై ఆరా తీశారు.

సిలిగురిలో 1206 కోట్ల రూపాయలతో చేపట్టే జాతీయ రహదారుల ప్రాజెక్టులకు గడ్కరీ నేడు శంకుస్థాపన చేశారు. తీస్తా నదిపై 1100 కోట్ల రూపాయలతో త్వరలో వంతెన నిర్మిస్తామని కూడా గడ్కరీ హామీ ఇచ్చారు. రహదారుల నిర్మాణం కారణంగా సిక్కిం, డార్జిలింగ్, భూటాన్‌లకు కనెక్టివిటీ పెరుగుతుందని, ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని గడ్కరీ చెప్పారు.

Updated Date - 2022-11-17T15:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising