ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Top 10 Expat Cities: ప్రవాసులు ఎక్కువగా దుబాయ్, అబుదాబి నగరాలను ఎందుకు ఇష్టపడతారో మీకు తెలుసా..?

ABN, First Publish Date - 2022-12-09T10:20:00+05:30

వలసదారులకు (Expats) రెసిడెన్సీకి, వర్కింగ్‌కు సంబంధించి అత్యంత అనువైన నగరాల జాబితాను 'ఎక్స్‌పాట్ సిటీ ర్యాంకింగ్-2022' (Expat City Ranking 2022) పేరిట గతవారం ఇంటర్నేషన్స్ (InterNations) సంస్థ విడుదల చేసిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: వలసదారులకు (Expats) రెసిడెన్సీకి, వర్కింగ్‌కు సంబంధించి అత్యంత అనువైన నగరాల జాబితాను 'ఎక్స్‌పాట్ సిటీ ర్యాంకింగ్-2022' (Expat City Ranking 2022) పేరిట గతవారం ఇంటర్నేషన్స్ (InterNations) సంస్థ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ర్యాంకింగ్‌లో ప్రవాసులకు అత్యంత అనువైన నగరంగా స్పెయిన్‌లోని వాలెన్సియా (Valencia) నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా దుబాయ్, మెక్సికో సిటీ, లిస్బన్, మాడ్రిడ్, బ్యాంకాక్, బసెల్, మెల్‌బోర్న్, అబుదాబి, సింగపూర్ నగరాలు టాప్-10 చోటు దక్కించుకున్నాయి. 50 దేశాలకు గాను విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో దుబాయ్ (Dubai) రెండో స్థానంలో నివడానికి ప్రధానంగా రెండు కారణాలు.. ఒకటి జీవన నాణ్యత, రెండోది సులభంగా స్థిరపడటం.

అలాగే ఇంటర్నేషన్స్ నిర్వహించిన సర్వేలో దుబాయ్‌లోని ప్రవాసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. వాటిలో ఎమిరేట్‌లో ప్రభుత్వ సేవలను పొందడం చాలా సులభం అన్నారు. అంతేగాక స్థానిక అధికారుల సేవలు పొందడంలోనూ సౌలభ్యం అధికంగా ఉంటుందని ప్రవాసులు తెలిపారు. కార్ల కోసం మౌలిక సదుపాయాలు, డైనింగ్, నైట్ లైఫ్, కల్చర్ విషయంలో కూడా దుబాయ్ బెస్ట్ అని వలసదారులు తేల్చేశారు. ఇక్కడి ప్రవాసులు తమ ఉద్యోగాలతో చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులు తమ ఉద్యోగాలతో 64 శాతం మంది తాము సంతోషంగా ఉన్నామని చెబితే దుబాయ్‌లో మాత్రం 70 శాతం సంతోషంగా ఉన్నామని చెప్పడం విశేషం. మొత్తంగా కొత్తగా వచ్చేవారికి దుబాయ్‌లో ఘన స్వాగతం లభిస్తుందని సర్వే తేల్చింది.

అలాగే మరో అరబ్ నగరం అబుదాబి (Abu Dhabi) కూడా ప్రవాసుల మన్ననలు అందుకుంటోంది. వైద్య సంరక్షణ, లభ్యత, నాణ్యతలలో అబుదాబి మొత్తం మీద మొదటి స్థానంలో ఉంది. ఇక ప్రవాసుల నిత్యావసరాల సూచికలో అబుదాబి రెండవ స్థానంలో నిలిచింది. ఈ నగరానికి వచ్చిన ప్రవాసులు తమ కెరీర్ అవకాశాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. అంతేగాక ప్రపంచ సగటుతో పోల్చితే ఇక్కడ స్థిరపడటం, బ్యాంక్ ఖాతాలు తెరవడం చాలా సులభం అని చెప్పారు. ఈ కారణాలతోనే ప్రవాసులు దుబాయ్, అబుదాబి నగరాలను ఎక్కువగా ఇష్టపడతున్నారు.

Updated Date - 2022-12-09T10:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising