ఇంటి ముందు రెండు మూడు రోజులు వార్తా పత్రికలు వేసి.. నాలుగో రోజు వీళ్లు చేసే పని తెలిస్తే.. వామ్మో! అంటారు..
ABN, First Publish Date - 2022-11-03T19:40:42+05:30
చోరీలు చేయడంలో రాను రాను నేరస్థులు తెలివిమీరిపోతున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా.. అలా వచ్చి.. ఇలా లక్షల రూపాయలను ఎత్తుకెళ్తుంటారు. ఇక ఇళ్లను టార్గెట్ చేయడంలోనూ చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే.. సినిమా తరహా చోరీలకు పాల్పడుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో కొందరు దొంగల తెలివిని చూసి..
చోరీలు చేయడంలో రాను రాను నేరస్థులు తెలివిమీరిపోతున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా.. అలా వచ్చి.. ఇలా లక్షల రూపాయలను ఎత్తుకెళ్తుంటారు. ఇక ఇళ్లను టార్గెట్ చేయడంలోనూ చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే.. సినిమా తరహా చోరీలకు పాల్పడుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో కొందరు దొంగల తెలివిని చూసి స్థానికులు షాక్ అవుతున్నారు. ఇంటి ముందు రెండు మూడు రోజులు వార్తా పత్రికలు వేసి.. నాలుగో రోజు వారు చేసే చోరీలను చూసి పోలీసులు కూడా అవాక్కవుతున్నారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్ పరిధిలో ఇటీవల చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. దొంగల (Thieves) తెలివి చూసి చివరకు పోలీసులే షాక్ అవుతున్నారు. చోరీ చేసే ముందు వారు ఇళ్లను టార్గెట్ చేస్తారు. ఇందుకోసం తాళం వేసి ఉన్న ఇళ్ల ముందు న్యూస్ పేపర్ (Newspaper) పడేస్తారు. ఆ పేపర్‌ను తీసుకుంటారో, లేదో అని గమనిస్తారు. వరుసగా రెండు మూడు రోజులు పేపర్‌ను తీసుకోకపోతే.. ఇక ఇంటిని టార్గెట్ చేస్తారు. ఇదిలావుండగా, అవంతిక కాలనీకి చెందిన రవీంద్ర కుమార్ అనే ఓ వ్యక్తి బ్యాంక్‌లో పని చేసి.. ఇటీవలే ఉద్యోగ విరమరణ చేశారు. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని (Jammu and Kashmir state) వైష్ణోదేవి అమ్మవారిని (Vaishno Devi Temple) దర్శించుకునేందుకు వెళ్లారు.
తాళం వేసి ఉండడంతో దొంగల దృష్టి వీరి ఇంటిపై పడింది. యథాప్రకారం వీరి ఇంటి ఎదుట కూడా మూడు రోజుల పాటు న్యూస్ పేపర్‌ను పడేశారు. ఎవరూ తీయకపోవడంతో ఆ ఇంటిని టార్గెట్ చేశారు. రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి.. రూ.5లక్షల నగదు, మరో రూ.5లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బుధవారం ఇంటికి వచ్చిన ఇంటి యజమాని.. తాళం తెరచి ఉండడం చూసి షాక్ అయ్యాడు. లోపలికి వెళ్లి చూడగా.. నగలు, నగదు (Jewelry and cash) కనిపించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. నగలు, నగదుతో పాటూ సీసీ కెమెరాలకు (CC cameras) సంబంధించిన పరికరాలను కూడా దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-11-03T19:47:28+05:30 IST