క్లాస్ రూంలో టీచర్‌ను వీడియో తీసిన విద్యార్థులు.. దగ్గరికి వెళ్లి.. ఐ లవ్ యూ అని చెప్పి..
ABN, First Publish Date - 2022-11-27T16:14:16+05:30
ఉపాధ్యాయుల పట్ల ఒకప్పుడు ఉండే భయభక్తులు, గౌరవ మర్యాదలు క్రమ క్రమంగా తగ్గిపోతున్నాయి. తోటి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే కొందరు యువకులు.. అంతటితో ఆగకుండా..
ఉపాధ్యాయుల పట్ల ఒకప్పుడు ఉండే భయభక్తులు, గౌరవ మర్యాదలు క్రమ క్రమంగా తగ్గిపోతున్నాయి. తోటి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే కొందరు యువకులు.. అంతటితో ఆగకుండా ఏకంగా టీచర్లను కూడా టార్గెట్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. క్లాస్ రూంలో టీచర్‌ను వీడియో తీసిన విద్యార్థులు.. చివరకు ఐ లవ్ యూ అంటూ అసభ్యకరంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే..
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. ఇలాంటి వివాహం ఇప్పటిదాకా జరగలేదట.. అంతమంది పోలీసులు ఎందుకొచ్చారంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్‌లోని కిథోర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఇంటర్ కళాశాలలో ఓ మహిళ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. 12 తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్న క్రమంలో ఈమెను.. ముగ్గురు విద్యార్థులు అదే పనిగా గమనిస్తూ ఉండేవారు. మొదట్లో ఆమెకు ఎలాంటి అనుమానమూ కలగలేదు. అయితే ఇటీవల ఓ రోజు కళాశాలకు వస్తున్న టీచర్‌ను ఆ ముగ్గురు విద్యార్థులు.. వెనుకే ఫాలో అయ్యారు. మధ్యలో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటూ హేళనగా మాట్లాడారు. అయినా ఎవరికీ చెప్పుకోలేక ఆమె అలాగే ఉండిపోయింది.
Dual Sim Cards: ఒకే ఫోన్‌లో రెండు సిమ్ కార్డుల ట్రెండ్‌కు శుభం కార్డు పడబోతోందా..?
ఇలాంటి పనులు మానుకోవాలంటూ పదే పదే వారిని మందలిస్తూ వచ్చింది. అయినా వారి తీరు మాత్రం మారలేదు. మళ్లీ ఇటీవల ఓ రోజు ఆమె పాఠాలు చెబుతుండగా.. సదరు విద్యార్థులు వీడియో తీశారు. వెనుక నుంచి దగ్గరికి వెళ్లి, ఆమెతో ఐ లవ్ యూ అని చెబుతూ మళ్లీ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో సదరు టీచర్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. చివరకు విధిలేని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విద్యార్థులను విచారించిన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Updated Date - 2022-11-27T16:14:20+05:30 IST