కుల్దీప్‌పై వేటేల?

ABN , First Publish Date - 2022-12-23T01:48:31+05:30 IST

తొలి టెస్టులో 8 వికెట్లు సాధించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన లెగ్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను పక్కనబెట్టడం విమర్శలకు దారి తీసింది.

కుల్దీప్‌పై వేటేల?

న్యూఢిల్లీ: తొలి టెస్టులో 8 వికెట్లు సాధించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన లెగ్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను పక్కనబెట్టడం విమర్శలకు దారి తీసింది. అతడిని తొలగించడం దురదృష్టకరమే అయినా.. ఉనాద్కట్‌కు ఇది మంచి అవకాశమని టాస్‌ సమయంలో కెప్టెన్‌ రాహుల్‌ తెలిపాడు. పిచ్‌ పచ్చికతో ఉండడంతో పేస్‌కు అనుకూలిస్తుందని మేనేజ్‌మెంట్‌ భావించింది. అదే నిజమైతే అశ్విన్‌, అక్షర్‌లలో ఒకరిని తప్పించాల్సిందని సునీల్‌ గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ఆటగాడిని తుది జట్టు నుంచి తప్పించడం నమ్మశక్యంగా లేదు. మొత్తం 20 వికెట్లలో కుల్దీప్‌ ఒక్కడే 8 వికెట్లు తీశాడు. అయినా అతడిపై వేటు వేయడం దారుణం’ అని సన్నీ తప్పుబట్టాడు.

Updated Date - 2022-12-23T01:48:32+05:30 IST