బాబ్లీ ప్రాజెక్టు గేట్ల మూసివేత
ABN , First Publish Date - 2022-10-30T01:46:22+05:30 IST
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరినదిపై నిర్మించిన బాబ్లీప్రాజెక్టు గేట్లు శనివారం మూసివేశారు.

బాసర రూరల్, అక్టోబరు, 29 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరినదిపై నిర్మించిన బాబ్లీప్రాజెక్టు గేట్లు శనివారం మూసివేశారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రతి సంవత్సరం జూలై 1వ తేదిన గేట్లను తెరిచి అక్టోబరు 28వ తేదిన మూసివేస్తారు. దీని ప్రకారం శనివారం కేంద్ర జలసంఘం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర అధికారుల సమక్షంలో ప్రాజెక్టు యొక్క 14 గేట్లను మూసివేశారు. మార్చి 1వ తేదీన గేట్లను తెరిచి 0.6 టీఎంసీల నీటిని దిగువకు శ్రీరాంసాగర్‌లోకి విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి ఉంది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ఈఈ సీడబ్ల్యూసీ, చక్రపాణి ఈఈ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, రవీంద్ర డీఈ మహారాష్ట్ర తదితరులు పాల్గొన్నారు.