మత సామరస్యానికి అర్వపల్లి దర్గా ప్రతీక

ABN , First Publish Date - 2022-12-24T00:52:40+05:30 IST

మత సామరస్యానికి అర్వపల్లి దర్గా ప్రతీకగా నిలుస్తోందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. దర్గా ఉర్సు ఉత్సవా ల్లో భాగంగా శుక్రవారం మండల కేద్రంలోని పోలీ్‌సస్టేషన్‌ నుంచి గంధాన్ని మంత్రి జగదీ్‌షరెడ్డి తీసుకొచ్చారు.

మత సామరస్యానికి అర్వపల్లి దర్గా ప్రతీక

విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి

అర్వపల్లి, డిసెంబరు 23: మత సామరస్యానికి అర్వపల్లి దర్గా ప్రతీకగా నిలుస్తోందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. దర్గా ఉర్సు ఉత్సవా ల్లో భాగంగా శుక్రవారం మండల కేద్రంలోని పోలీ్‌సస్టేషన్‌ నుంచి గంధాన్ని మంత్రి జగదీ్‌షరెడ్డి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర లో భారీ చాదర్‌ను ప్రదర్శనగా తీసుకెళ్లారు. దర్గా వద్ద గంధం కోసం భక్తులు పోటీపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో దర్గా పరిసరాలు కిక్కిరిశాయి. దర్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. మతసామరస్యానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, డీఎస్పీ నాగభూషణం, వక్ఫ్‌బోర్డ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌అలీ, ఖాదీం మౌలానా, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌, మన్నె లక్ష్మినర్సయ్యయాదవ్‌, సర్పంచ్‌ బైరబోయిన సునితరామలింగయ్య, ఎంపీటీసీ కనుకు పద్మ, మొరిశెట్టి ఉపేందర్‌, బందెల అర్వపల్లి, యుగేందర్‌, ప్రభాకర్‌, హమీద్‌, తదితరులు పాల్గొన్నారు.

క్రైస్తవులను ఆదరించిన మహనీయుడు కేసీఆర్‌

సూర్యాపేట కల్చరల్‌, సూర్యాపేట రూరల్‌: సర్వమతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ, క్రైస్తవులను ఆదరించిన మహనీయుడు సీఎం కేసీఆర్‌ అని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ విందులో ఆయన మాట్లాడారు. ప్రపంచ శాంతికోసం ఏసుక్రీస్తు చూపిన మార్గంలో అందరూ పయనించాలన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, తహసీల్దార్‌ వెంకన్న, మున్సిపల్‌ కో-ఆప్షన్‌మెంబర్లు పెద్దపంగు స్వరూపశశికాంత్‌, వెంపటి సురేష్‌, జడ్పీటీసీ జీడి బిక్షం, కౌన్సిలర్‌ జ్యోతిశ్రీవిద్య, గండూరి కృపాకర్‌, పాస్టర్లు పాల్గొన్నారు.

రైతు బీమా వరం: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బీమా ఒక వరమని మంత్రి జగదీ్‌షరెడ్డి పేర్కొన్నారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని కుసుమవారిగూడెం గ్రామంలో పౌలీ్ట్ర రంగంలో రాణిస్తున్న దివ్యాంగరైతు శంకర్‌ను మంత్రి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు ఉప్పల ఆనంద్‌, ఉపేందర్‌రెడ్డి, సతీష్‌, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-24T00:52:45+05:30 IST