Babli project గేట్లు ఎత్తివేత...గోదావరికి పోటెత్తిన వరద
ABN , First Publish Date - 2022-07-01T15:34:07+05:30 IST
గోదావరి నదిపై మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను శుక్రవారం ఉధయం అధికారులు ఎత్తివేశారు.

నిర్మల్: గోదావరి నదిపై మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ (Babli project) గేట్లను శుక్రవారం ఉదయం అధికారులు ఎత్తివేశారు. దీంతో జిల్లాలోని గోదావరి నదిలోకి వదర ప్రవాహం పోటెత్తింది. ఈ క్రమంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడం ద్వారా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏటా జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేస్తున్న విషయం తెలిసిందే.