ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam: కవిత తప్పు చేయకుంటే.. ఉలికిపాటెందుకు: రఘునందన్ రావు

ABN, First Publish Date - 2022-12-01T20:27:48+05:30

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ చేర్చడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఎమ్మెల్సీ కవిత.. కావాలనే బీజేపీపై నిందలు వేస్తున్నారన్నారు. తప్పు చేయని పక్షంలో ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ చేర్చడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఎమ్మెల్సీ కవిత.. కావాలనే బీజేపీపై నిందలు వేస్తున్నారన్నారు. తప్పు చేయని పక్షంలో ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) రిమాండ్ రిపోర్టులో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) పేరును ఈడీ (Enforcement Directorate) చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ కేసులో కవిత పాత్ర ఉందంటూ మీడియా లీకులకే పరిమితమయ్యాయి. కానీ మొదటిసారి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చింది. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయని.. దీంతో రాజకీయ ఎత్తుగడలో భాగంగా బీజేపీ చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తోందని ఆరోపించారు.

తాజాగా ఈ అంశంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (BJP MLA Raghunandan Rao) స్పందించారు. ఏబీఎన్‌ లైవ్ డిబేట్‌లో ఆయన మాట్లాడుతూ.. అమిత్ అరోరా ఇచ్చిన వాంగ్మూలంలో సౌత్ గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత, శరత్ రెడ్డి, వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేర్లు ఉన్నాయన్నారు. కానీ ప్రధాని మోదీ వచ్చే కంటే ముందు ఈడీ వస్తుందని.. ఎమ్మెల్సీ కవిత ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కానీ, తప్పుడు కేసులు పెట్టించాలనే ఉద్దేశం బీజేపీకి లేదని తెలిపారు.

సౌత్ గ్రూప్‌లో శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటూ కవిత కూడా భాగస్వామి అన్నది నిజమా కాదా, అదే గ్రూపు పేరుతో అవినీతి పాల్పడ్డారా లేదా... అనే విషయాలపై మాట్లాడకుండా బీజేపీని విమర్శించడం ఏంటని రఘునందన్ రావు ప్రశ్నించారు. తప్పు చేసిన వారు చట్టబద్ధంగా విచారణను ఎదుర్కోవాలని, నిజంగా తప్పు చేసినట్లు రుజువైతే ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు. తప్పు చేయనప్పుడు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. ఇక ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్తుందా, లేదా అనే విషయం.. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-12-01T21:03:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising