బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2022-12-28T00:36:24+05:30 IST
మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని కొండాపురంలో కౌలు రైతు బీసు నాగరాజు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు.
మోత్కూరు, డిసెంబర్ 27: మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని కొండాపురంలో కౌలు రైతు బీసు నాగరాజు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం కాంగ్రెస్ జిల్లా నాయకుడు డాక్టర్ వడ్డేపల్లి రవి నాగరాజు కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేలతో పాటు రూ.ఏడు వేల విలువ కల్గిన కిరాణ సామాన్లు అందజేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ డైరెక్టర్ మన్నె మల్లయ్య, కాంగ్రెస్ నాయకులు కారుపోతుల వెంకన్న, అవిశెట్టి కిరణ్, బైరు సాయికుమార్, కాలనీ వాసులు బీసు భాషా, బాలగాని శ్రీనివాస్, బీసు సత్తయ్య పాల్గొన్నారు.