గచ్చిబౌలిలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట
ABN , First Publish Date - 2022-11-06T00:25:02+05:30 IST
గచ్చిబౌలి డివిజన్‌లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.

ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
రూ.7.75 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రాయదుర్గం/గచ్చిబౌలి, నవంబర్ 5(ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలి డివిజన్‌లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల హుడాకాలనీ, గోపన్‌పల్లి, ఎన్టీఆర్‌నగర్, నానక్‌రాంగూడ, రాయదుర్గం కాలనీల్లో రూ.7.75 కోట్లతో చేపట్టబోయే థీమ్ పార్కులు, సీసీరోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్లు గంగాధర్‌రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్‌ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజునాయక్, నాయకులు చెన్నం రాజు, మంత్రిప్రగడ సత్యనారాయణ, శ్రీనుపటేల్, దారుగుపల్లి నరేష్, జంగయ్య, వినోద్, యాదగిరి, సల్లావుద్దీన్, అక్బర్, నర్సింహరాజు, రామేశ్వరమ్మ, అంజమ్మ, బాలమణి, మహిళా నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
హైదర్‌నగర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
హైదర్‌నగర్, నవంబర్ 5(ఆంధ్రజ్యోతి): హైదర్‌నగర్ డివిజన్ శ్రీనివాసకాలనీ, అల్లాపూర్ సొసైటీ కాలనీలో రూ.49లక్షల వ్యయంతో చేపట్టబోయే సీసీరోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, స్థానిక కాలనీల వాసులు పాల్గొన్నారు.