Revanth Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రెండు కోణాల్లో చూడాలి
ABN, First Publish Date - 2022-12-28T12:15:16+05:30
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రెండు కోణాల్లో చూడాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs Purchase Case)ను రెండు కోణాల్లో చూడాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) అన్నారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ... టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP) రెండు బాధితులుగా చూపిస్తున్నారని.. మరి ఇందులో దోషి ఎవరు అని ప్రశ్నించారు. విచారణ ఒకరిని బాధితుని కింద.. మరొకరిని నేరగాని కింద జరుగుతుందన్నారు. నేరం జరిగింది.. కానీ విచారణ తామే చేస్తాం అనడం ద్వారా టీఆర్ఎస్ లోపం బయటపడిందని వ్యాఖ్యలు చేశారు. నేరమే జరగలేదని అంటూనే సీబీఐ విచారణ అడగడం ద్వారా బీజేపీ లోపం బయటపడుతుందని తెలిపారు. సీబీఐ విచారణ అనగానే బీజేపీ, సిట్ విచారణ అనగానే టీఆర్ఎస్ ఎందుకు సంకలు గుద్దుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు.
రాజకీయ అవసరాలకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో కాంగ్రెస్ ఇంప్లీడ్ పీటీషన్ వేయాలా వద్దా అనే దానిపై చర్చ జరుగుతోందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వారని తెలిపారు. పార్టీ మారిన వారికి టీఆర్ఎస్‌లో మంచి పదవులు ఇచ్చారని.. ఇది కూడా కరప్షన్ కిందే వస్తుందన్నారు. అందుకే కొనుగోలు కేసు.. ఇన్ కంప్లీట్ కేసు అని చెప్పుకొచ్చారు. కాబట్టి 2018 నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి విచారణ జరగాలని సీబీఐకి ఫిర్యాదు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
Updated Date - 2022-12-28T12:15:17+05:30 IST