Remand Report: ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ఏం చెప్పారంటే
ABN, First Publish Date - 2022-11-21T10:29:21+05:30
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసనగానే ఆయన ఇంటిపై దాడి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavita)పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసనగానే ఆయన ఇంటిపై దాడి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ (Police Remand Report)లో పేర్కొన్నారు. కవిత (TRS MLC)పై పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రెస్‌మీట్‌లు పెట్టి... ఆ ప్రెస్‌మీట్లను సోషల్ మీడియాలో వైరల్ చేశారని.. అందుకు నిరసనగానే దాడి జరిగిందని పేర్కొన్నారు. అరవింద్ (BJP MP) ఇంటిపై దాడి చేసిన తొమ్మిది మందిలో ఇద్దరు పీహెచ్‌డీ స్టూడెంట్స్ ఉన్నారన్నారు. కాగా... అరవింద్(Nizamabad MP)పై దాడి కేసులో జాగృతి నవీనాచారి జాగృతి కన్వీనర్ రాజీవ్ సాగర్ పేర్లు పత్తాలేకుండా పోయాయి. పలు ప్రెస్‌మీట్‌ల సందర్భంగా కవితను అరవింద్ పదేపదే టార్జెట్ చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. కవిత (TRS Leader)పై వ్యాఖ్యలకు నిరసనగానే ఎంపీ ఇంటిపై దాడి ప్లాన్ చేశారన్నారు. అరవింద్ ఇంటి వద్ద ఎక్కువ సంఖ్యలో బందోబస్తు లేకపోవడంతో నిందితులు దాడికి తెగబడ్డారని అన్నారు. ఈ ఘటనలో 2 సిమెంట్ రాళ్ళు, 2 కర్రలు, టీఆర్ఎస్ జెండాలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న పూజా సామగ్రి, హాల్ ధ్వంసంతో పాటు కార్‌పై దాడి చేశారన్నారు. నిందితులకు పోలీసుల 41 సీఆర్‌పీసీ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
Updated Date - 2022-11-21T10:29:23+05:30 IST