పచ్చదనం...పరిశుభ్రత
ABN , First Publish Date - 2022-05-16T06:40:50+05:30 IST
పచ్చదనం, పరిశుభ్రతను పెంపొం దించడంలో మెళుకువలను పాటిస్తూ జిల్లాలోని రెండు మున్సిపాల్టీలు రాష్ట్ర ప్రభుత్వంచే శభాష్ అనిపించుకున్నాయి.

రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కించుకున్న జగిత్యాల, కోరుట్ల బల్ధియాలు
మంత్రి కేటీఆర్..ఉన్నత స్థాయి అధికారులచే ప్రశంసలు
జగిత్యాల, మే 15 (ఆంధ్రజ్యోతి): పచ్చదనం, పరిశుభ్రతను పెంపొం దించడంలో మెళుకువలను పాటిస్తూ జిల్లాలోని రెండు మున్సిపాల్టీలు రాష్ట్ర ప్రభుత్వంచే శభాష్ అనిపించుకున్నాయి. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆశలు, ఆశయాలకు తగ్గట్టుగా మున్సిపాల్టీల్లో పచ్చ దనం, పరిశుభ్రతను పరిరక్షిస్తూ జగిత్యాల, కోరుట్ల పట్టణాలు ప్రత్యేకత ను చాటుకున్నాయి. 2021-22 సంవత్సరానికి గాను ప్రభుత్వం ప్రకటించి న పట్టణ ప్రగతి అవార్డులను జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల మున్సిపాల్టీలు దక్కించుకున్నాయి. పచ్చదనంలో జగిత్యాల మున్సిపాల్టీ రాష్ట్రంలోనే ద్వితీ య స్థానంలో పరిశుభ్రతలో కోరుట్ల మున్సిపాల్టీ తొలి స్థానంలో నిలిచా యి. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ల చేతుల మీదుగా అవార్డును అందుకున్నాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కోరు ట్ల మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, కమిషనర్ అయాజ్లు ప్రశంసా పత్రాలను, పురస్కారాలను స్వీకరించారు.
పరిశుభ్రతలో కోరుట్ల ప్రథమ స్థానం....
పరిశుభ్రత పాటించడంలో రాష్ట్రంలోనే కోరుట్ల మున్సిపల్ ప్రథమ స్థా నంలో నిలిచింది. లక్ష లోపు జనాభా గల మున్సిపల్లో కోరుట్ల మున్సి పల్‌ను శానిటేషన్ విభాగం (పరిశుభ్రత)లో ఉత్తమ మున్సిపాల్టీగా ఎంపి కైంది. కోరుట్ల పట్టణంలో 33 వార్డులుండగా సుమారు లక్ష వరకు జనాభా ఉంది. ప్రతీనిత్యం పారిశుధ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంప్ యార్డుకు తరలిస్తుంటారు. 33 ఆటోలు, 4 ట్రాక్టర్ల ద్వారా 28.25 మెట్రిక్ టన్నుల తడిపొడి చెత్తను వేర్వురుగా సేకరించి డంపింగ్ యార్డు కు తరలించి ఎరువును తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి క రీంనగర్ జిల్లాలో తొలిసారిగా పర్యావరణ పరిరక్షణకు రూ. 1.83 కోట్లతో మానవ మల వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. పట్టణంలో గల సుమారు 20 వేల ఇళ్లలో మరుగుదొడ్లు నిండిన తదుపరి ప్రత్యేక వాహనాల్లో సేకరించి ప్లాంట్‌కు తరలించి ఎరువును తయారు చేస్తున్నా రు. ఇంటింటికీ జియో ట్యాగింగ్ ఏర్పరచి ఫోన్ నంబర్లకు లింకు చేశారు. ప్రతీ ఇంటి యజమానికి మూడు సంవత్సరాలకొకమారు సెప్టిక్ ట్యాంక్ నిండిందని శుభ్రం చేసుకోవాలని మెస్సేజ్‌లు పంపుతున్నారు. వంద శా తం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మింపజేసి బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎప్) పట్టణ జాబితాలో నిలిచింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రజా మరుగుదొడ్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ప్రజా మరు గుదొడ్లను ఉచితంగా వినియోగించుకునే విధంగా సుమారు 1500 మంది కి పాస్‌లు జారీ చేశారు. మురుగు కాలువలను, రహదారులు ఎప్పటికప్పు డు శుభ్రపరుస్తూ చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు. మున్సిపల్ ప్రజాప్రతి నిధులు, అధికారులు, సిబ్బంది పలు రకాల మెళుకువలను పాటిస్తూ కోరుట్ల పట్టణాన్ని పరిశుభ్రతలో అగ్రగామిగా నిలిపారు.
పచ్చదనంలో జగిత్యాల ద్వితీయ స్థానం...
పచ్చదనం వెల్లివిరిసేలా చేయడంలో రాష్ట్రంలోనే జగిత్యాల మున్సిపా ల్టీలో ద్వితీయ స్థానంలో నిలిచింది. లక్షకు పైగా జనాభా గల పట్టణాలతో పోటీపడ్డ జగిత్యాల మున్సిపల్ పచ్చదనం (హరితహారం) విభాగంలో ద్వి తీయ ఉత్తమ మున్సిపాల్టీగా ఎంపికైంది. రాష్ట్రంలోని ఖమ్మం కార్పొరేషన్ 168 పాయింట్లు సాధించి తొలి స్థానంలో నిలవగా, అంతే 168 పాయిం ట్లు సాధించిన జగిత్యాల మున్సిపాల్టీ ద్వితీయ, రామగుండం కార్పొరేషన్ తృతీయ, సూర్యాపేట మున్సిపాల్టీ చతుర్థ స్థానాలను దక్కించుకున్నాయి. జగిత్యాల మున్సిపాల్టీలో 38 వార్డులున్నాయి. 1,00,835 జనాభా, 23,213 గృహాలున్నాయి. పట్టణంలో పచ్చదనం పెంపొందించడానికి మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హ రితహారం కార్యక్రమంలో వివిధ రకాల మొక్కలను తెప్పించి నాటుతు న్నారు. పట్టణం గుండా వెళ్తున్న జాతీయ రహదారికి ఇరువైపుల నాటడం తో పాటు, డివైడర్ల మద్యలో వివిధ రకాల పూల మొక్కలను నాటి సం రక్షిస్తున్నారు. వార్డుల్లోని కాలనీలో మొక్కలు నాటడం, ట్రీ గార్డులను ఏర్పరచడం, సమీపంలో ఇంటి యజమానులకు సంరక్షణ బాధ్యత లను అప్పగించడం వంటివి జరుపుతున్నారు. ఆరు విడతలుగా నిర్వ హించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ యేటా సుమారు లక్షకు పైగా మొక్కలు నాటడం, సంరక్షించడం వంటివి జరుపుతున్నారు. జగిత్యాల మున్సిపల్లో ప్రకృతి వనాలు, ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, ట్రీ పార్కులు, అర్బన్ పార్కు, అర్బన్ అట వీ పార్కు, వాక్‌వే, కూడళ్ల అభివృద్ధి, మినీట్యాంక్ బండ్, ఓపన్ జిమ్ తది తర నిర్మాణాల్లో మెళుకువలను పాటిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. హ రితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ నాలుగు మొక్కలను పంపి ణీ చేశారు. ఇళ్లలో పెంచుకునే విధంగా వివిధ రకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలు, అందాన్నిచ్చే విధంగా ఉండే మొక్కలను అందించారు. ప్రధాన రహదారులు, కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లలో సైతం సాధ్యమైనంత మేరకు ఎక్కువ మొక్కలను పెంచుతూ పచ్చదనం పెం పొందించడానికి కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సల హాలు, సూచనలు పాటిస్తూ రాష్ట్రంలోనే హరితహారంలో జగిత్యాల మున్సి పల్‌ను రెండవ స్థానంలో నిలిపారు.
సీఎం కేసీఆర్ ఆశయాల మేరకే....
- డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ ఆలోచనలు, ఆశయాల మేరకే మున్సిపాల్టీల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించడం వంటి కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తు న్నాము. ప్రభుత్వ లక్ష్యం మేరకు పనిచేయడం వల్ల అవార్డులు దక్కుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో పరిశుభ్రతలో ద్వితీయ స్థానంలో నిలిచిన జగిత్యా ల బల్ధియా అధికారులు, ప్రజాప్రతినిధులను అభినందిస్తున్నాను.
ఆనందంగా ఉంది
- బోగ శ్రావణి ప్రవీన్, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్
ప్రభుత్వం సూచించిన లక్ష్యాన్ని నెరవేరుస్తూ హరితహారం విభాగంలో రాష్ట్ర స్థాయిలో జగిత్యాల మున్సిపాల్టీ రెండవ స్థానంలో నిలవడం ఆనం దంగా ఉంది. పట్టణంలో పచ్చదనాన్ని మరింత పెంపొందించడానికి అవ సరమైన చర్యలను రెట్టింపు ఉత్సాహంతో చేపడుతాము.
సమిష్టి కృషితోనే...
అయాజ్, మున్సిపల్ కమిషనర్, కోరుట్ల
కోరుట్ల మున్సిపల్లో పరిశుభ్రతను నెలకొల్పడానికి నిరంతరం కృషి చేస్తున్నాము. సమిష్టి ప్రయత్నాల వల్లనే లక్ష్యాన్ని సాధిస్తున్నాము. ఎప్ప టికప్పుడు ప్రజలతో మమేకమవుతూ అవగాహన కల్పిస్తున్నాము. పరిశు భ్రత సాధించడానికి అన్ని వర్గాల సహకారాలను తీసుకుంటున్నాము.