Konda Surekha: రేవంత్ రెడ్డి హామీతో కొండా సురేఖ వెనక్కు తగ్గారా?

ABN , First Publish Date - 2022-12-11T19:15:18+05:30 IST

కొండా సురేఖ (Konda Surekha) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) తో భేటీ అయ్యారు.

Konda Surekha: రేవంత్ రెడ్డి హామీతో కొండా సురేఖ వెనక్కు తగ్గారా?
Konda Surekha meets Revanth

హైదరాబాద్: కాంగ్రెస్ కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) తో భేటీ అయ్యారు. ఏఐసీసీ వేసిన తెలంగాణ ప్రదేశ్ కమిటీలు తనకు అసంతృప్తిని కలిగించాయని ఆమె చెప్పారు. తెలంగాణ పొలిటికల్ ఎఫైర్స్‌లో తన పేరు లేదని, వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ లీడర్ పేరు లేకపోవడం మనస్తాపం కలిగించిందని రేవంత్‌తో చెప్పారు. తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ ఎఫైర్స్‌లో తనకంటే జూనియర్లను నామినేట్ చేశారని, తనను మాత్రం తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా నియమించడం బాధ కలిగించిందని రేవంత్‌తో చెప్పినట్లు తెలిసింది. తనకు పదవులు ముఖ్యం కాదని, ఆత్మాభిమానం ముఖ్యమని చెప్పినట్లు సమాచారం. కొండా సురేఖ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానన్న రేవంత్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా మాట్లాడతానని చెప్పినట్లు సమాచారం. సాధ్యమయినంతమేరకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సురేఖ పేరు వచ్చేలా చూస్తానని రేవంత్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న కొండా సురేఖ గతంలో పరకాల, శాయంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కొండా సురేఖ భర్త కొండా మురళీ మాజీ ఎమ్మెల్సీ. కుమార్తె కొండా సుస్మితాను రాజకీయాల్లోకి తీసుకురావాలని కొండా దంపతులు యోచిస్తున్నారు. గతంలో మూడు టికెట్లు ఆశించిన కొండా కుటుంబం ప్రస్తుతం రెండు ఎమ్మెల్యే టికెట్లను ఆశిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-12-11T19:16:12+05:30 IST