పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో పచ్చదనం
ABN , First Publish Date - 2022-05-16T05:29:47+05:30 IST
పల్లె ప్రకృతి వనాలతో గ్రామీణ ప్రాంతాలు పచ్చదనానికి నిలయాలుగా మారుతాయని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అన్నారు.

- పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, మే 15 : పల్లె ప్రకృతి వనాలతో గ్రామీణ ప్రాంతాలు పచ్చదనానికి నిలయాలుగా మారుతాయని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వివిధ వివాహ కార్యక్రమాలకు హాజరైన ఆఅయన మండలంలోని కుర్వపల్లిలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. అలాగే సంవత్సరం క్రితం తాను నాటిన మొక్కను కాపాడిన సర్పంచ్ శ్రీనును అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అడవుల్లో విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు. నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తే అటవీశాతం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.