ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KCR Tamilisai: తమిళిసైతో కేసీఆర్ మాట కలిపారనుకునేలోపే ట్విస్ట్ ఇచ్చారుగా..!

ABN, First Publish Date - 2022-12-26T18:59:01+05:30

తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) శీతాకాల విడిది పర్యటన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR), గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) మధ్య స్నేహపూర్వక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) శీతాకాల విడిది పర్యటన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR), గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పరిమళింపజేసింది. కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న కేసీఆర్, తమిళిసై (KCR Tamilisai Terms) చాలా రోజుల తర్వాత రాష్ట్రపతి పర్యటన పుణ్యాన ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. గవర్నర్ తమిళిసైతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు కలిపారు. ఆ తర్వాత రాష్ట్రపతితో ప్రముఖుల పరిచయ కార్యక్రమంలో కూడా తమిళిసై, కేసీఆర్ ఒకే వేదికపై కనిపించారు. అయితే.. రాష్ట్రపతికి కలిసి స్వాగతం పలికి మాటామంతీ కలిపి కేసీఆర్, తమిళిసై సఖ్యతతో ఉన్నట్లు కనిపించినప్పటికీ రాజ్‌భవన్‌లో (Telangana Raj Bhavan) రాష్ట్రపతికి గవర్నర్ ఇస్తున్న విందుకు మాత్రం కేసీఆర్ దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు సీఎం షెడ్యూల్‌లో (CM KCR Schedule) గవర్నర్ విందు కార్యక్రమం లేకపోవడం, హకీంపేట్‌ (Hakimpet) నుంచి ఫామ్‌హౌస్‌కు సీఎం కేసీఆర్‌ (CM KCR Farmhouse) నేరుగా బయల్దేరి వెళ్లడంతో ఆయన గవర్నర్ ఇస్తున్న విందుకు హాజరు కాకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, గవర్నర్ తమిళిసైకి కొంత కాలంగా ఎడ తెగని పంచాయితీ నడుస్తోంది. గవర్నర్‌ కోటా కింద పాడి కౌశిక్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గవర్నర్‌ తమిళిసై తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య వివాదం రాజుకుంది. ప్రతిసారి గణతంత్ర వేడుకలను పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహిస్తారు. కానీ.. ఒమైక్రాన్‌ కేసుల కారణంగా ఈ ఏడాది జనవరి 26న ఉత్సవాలను పరిమిత సంఖ్యలో రాజ్‌భవన్‌లోనే నిర్వహించాలంటూ ప్రభుత్వం నుంచి షెడ్యూలు వెలువడింది. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్న అభిప్రాయాలు అప్పట్లో వెలువడ్డాయి. సీఎం కేసీఆర్‌, ఇతర మంత్రులు ఎవరూ గణతంత్ర వేడుకలకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.

ఆ తర్వాత ఎంఐఎం సభ్యుడు జాఫ్రీని శాసన మండలి ప్రొటెం చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. దీని గురించి గవర్నర్‌ ప్రభుత్వాన్ని వివరణ అడిగారు. గవర్నర్‌ తమిళిసై మేడారం జాతరకు వెళ్లిన సందర్భంలోనూ ప్రొటోకాల్‌ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం పాటించకపోవడమూ చర్చనీయాంశమైంది. ఇలా ఇరు వర్గాల మధ్య రోజుకో వివాదం చోటు చేసుకుంటుండడంతో సీఎంవో, రాజ్‌భవన్‌ మధ్య దూరం క్రమేపీ పెరుగుతూ వచ్చింది. గవర్నర్ తమిళిసై కూడా బాహాటంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తప్పుబట్టిన సందర్భాలున్నాయి. గవర్నర్‌ను నిమిత్తమాత్రురాలిగా చేయడానికి సీఎంవో ప్రయత్నిస్తోందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరిగింది.

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య ముదిరిన వివాదం కారణంగా ఆమెను పక్కన పెట్టే ప్రయత్నాలు అధికార టీఆర్‌ఎస్ ముమ్మరం చేసిందని వాదన తెరపైకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీల మధ్య ఉన్న పొరపొచ్చాలు, వివాదాలకు వ్యవస్థలను బలి చేయవద్దని, రాజ్యాంగపరమైన పదవులకు విలువ ఇవ్వాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ... ప్రభుత్వం ఇలాంటి అభిప్రాయాలు, విమర్శలను ఏమాత్రం లెక్క చేయకపోవడంతో ఒకానొక దశలో గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది మూలాన అంటీముట్టనట్టు ఉన్న ఈ ఇద్దరూ మళ్లీ ముచ్చటించుకునేంత కాకపోయినా సఖ్యంగా పలకరించుకున్న పరిస్థితి కనిపించింది.

ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్రపతి ముర్ముకు ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, రేగా కాంతారావు, బాలరాజ్, హర్షవర్దన్‌రెడ్డి స్వాగతం పలకడం కొసమెరుపు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఈ నలుగురే కావడం గమనార్హం. వ్యూహాత్మకంగానే ఈ ఎమ్మెల్యేలను కేసీఆర్ వెంటబెట్టుకుని వెళ్లి ఉండొచ్చనే చర్చ మొదలైంది. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ఉన్న గ్యాప్‌ను కాస్త తగ్గించినట్టే తగ్గించింది. కానీ.. షెడ్యూల్‌లో లేదనే కారణంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ విందుకు సీఎం కేసీఆర్ వెళ్లకపోవడం గవర్నర్‌తో ఆ గ్యాప్ కొనసాగుతుందనే సంకేతాలకు కారణమైంది.

Updated Date - 2022-12-26T19:02:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising