TRS MLAs Poaching Case: తెలంగాణ హైకోర్టు షాక్.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు
ABN, First Publish Date - 2022-12-26T16:52:22+05:30
సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాకిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case) లో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాకిచ్చింది. ఎమ్మెల్యేల బేరసారాల కేసు (TRS MLAs Poaching Case) లో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసును సీబీఐ (CBI) తో విచారణ జరిపించాలని బీజేపీ (BJP) పిటిషన్ దాఖలు చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసును చేధించేందుకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే మొదటి నుంచి సిట్ దర్యాప్తును బీజేపీని వ్యతిరేకిస్తూ వస్తోంది. సిట్ విచారణపై అనుమానాలున్నాయని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు, హైకోర్టును కోరారు. న్యాయవాదుల వాదనలు ఏకీభవించిన న్యాయస్థానం సీబీఐకి ఆర్డర్ చేస్తూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ రోజు ఉదయం నుంచి ఈ కేసు విచారణ ఉత్కంఠ రేపింది. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైదరాబాద్ సీపీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ విచారణ చేస్తోంది. ఇప్పుడు ఈ కేసును హైకోర్టుకు అప్పగించడంతో విచారణను తిరిగి మొదటి నుంచి విచారించే అవకాశం ఉంది.
నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీ స్కెచ్!
అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన యత్నాన్ని సైబరాబాద్ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ‘‘టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ఎమ్మెల్యేలు దీనిపై తమకు ఫిర్యాదు చేశారని.. తమకు డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఎర చూపించి పార్టీ మారాలని బలవంతం చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకు పక్కా ప్రణాళిక ప్రకారం వల పన్ని ఈ ఆపరేషన్ నిర్వహించాం’’ అని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్
ఎమ్మెల్యే కొనుగోలు కేసు దర్యాప్తునకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలతో ఈ సిట్ ఏర్పాటైంది. సిట్‌లో నల్లగొండ ఎస్పీ రెమారాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ(నేరాలు) కల్మేశ్వర్ సింగన్వార్, శంషాబాద్ డీసీపీ ఆర్.జగదీశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ బి.గంగాధర్, మొయినాబాద్ ఠాణా ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ బృందం రాష్ట్ర పోలీసు హెడ్‌క్వార్టర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) కేంద్రంగా దర్యాప్తును కొనసాగిస్తోంది. కీలక కేసుల్లో సిట్ ఏర్పాటు సాధారణమే అయినా.. డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని నియమించడం రాష్ట్రంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తొలిసారి.
Updated Date - 2023-01-28T00:10:26+05:30 IST