ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Praja Sangrama Yatra: బండి సంజయ్‌కు షాకిచ్చిన తెలంగాణ పోలీసులు

ABN, First Publish Date - 2022-11-27T20:56:26+05:30

ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

Bandi Sanjay Kumar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar) ఈ నెల 28 నుంచి డిసెంబర్ 16 వరకూ తలపెట్టిన 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra)కు నిర్మల్‌ జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించారు. భైంసాలో సున్నితమైన పరిస్థితుల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నామన్నారు. బహిరంగసభతో పాటు యాత్రకు భద్రత ఇవ్వలేమన్నారు.

అయితే పాదయాత్ర నిర్వహించి తీరుతామని తెలంగాణ బీజేపీ నేతలు స్పష్టం చేశారు. పాదయాత్రపై నిర్మల్‌ ఎస్పీకి ముందే సమాచారం ఇచ్చామని, పాదయాత్ర, సభకు అన్నిఏర్పాట్లు పూర్తిచేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు పోలీసులు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని కమలనాథులు ఆరోపించారు. యాత్రను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదంటూ నిర్మల్‌ జిల్లా ఎస్పీ ఆఫీస్‌ దగ్గర బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఇప్పటివరకూ 4 విడతల్లో 21 జిల్లాల్లోని 1178 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశారు. ఐదో విడత పాదయాత్ర ఆయన బాసరలో పూజలు చేసి భైంసాలో ప్రారంభించి కరీంనగర్‌లో ముగించాలనుకున్నారు.

Updated Date - 2022-11-27T21:47:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising