Achchennaidu: నిజమైన ముద్దాయి జైలుకెళ్లే రోజులు దగ్గర పడ్డాయి
ABN, First Publish Date - 2023-01-31T18:34:56+05:30
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సునామీలా కొనసాగుతోందని ఏపీ టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Achchennaidu) అన్నారు.
గుంటూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సునామీలా కొనసాగుతోందని ఏపీ టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Achchennaidu) అన్నారు. పాదయాత్రకు తమకు మేమే రక్షణ కల్పించుకుంటామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర నాలుగో రోజు ఉత్సాహంగా సాగుతోంది. లోకేష్ పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.
వాస్తవాలు మాట్లాడితే కొన్ని కుక్కలు మొరుగుతున్నాయని మండిపడ్డారు. జీడీపీ బాగుంటే జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు? అని అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తప్పుడు హామీలతో జగన్ సీఎం అయ్యారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీబీఐ (CBI) విచారణతో నిజమైన ముద్దాయి జైలుకెళ్లే రోజులు దగ్గర పడ్డాయని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. అవినాష్‌రెడ్డి(Avinash Reddy)ని సీబీఐ పిలిచినప్పటి నుంచి జగన్‌రెడ్డి(Cm JaganMohan Reddy)కి నిద్ర పట్టడం లేదని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఎద్దెవా చేశారు.
ఇటీవల వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును త్వరగా తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రజల అభిమానాన్ని పొందిన అంత పెద్ద నాయకుడి కేసు విచారణకు ఇంకా ఎన్నాళ్లు పడుతుందని ఆమె ప్రశ్నించారు. కేసు విచారణ త్వరగా తేలకపోతే సీబీఐ (CBI)పై ప్రజలకు ఉన్న నమ్మకం పోతుందని షర్మిల అన్నారు. వివేకా హత్యకేసు విచారణలో ప్రభుత్వాల జోక్యం ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది.
Updated Date - 2023-01-31T18:57:40+05:30 IST