ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Adala Hot Comments on Kotamreddy : డబ్బు పిచ్చి ఎక్కువైంది.. నీ చరిత్ర గుట్టు విప్పుతాం

ABN, First Publish Date - 2023-02-09T13:32:46+05:30

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి పచ్చి అబద్దాలు మాట్లాడటం చాలా తప్పు అని హితవు పలికారు. మూడున్నరేళ్లుగా అరాచకం చేశావని.. డబ్బు పిచ్చి ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు : వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి పచ్చి అబద్దాలు మాట్లాడటం చాలా తప్పు అని హితవు పలికారు. మూడున్నరేళ్లుగా అరాచకం చేశావని.. డబ్బు పిచ్చి ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి గుట్టు త్వరలోనే ప్రజల దగ్గర విప్పుతామన్నారు. ఎంతమందిని ఏ విధంగా వేధించావో ప్రజలకి తెలుసన్నారు. తానే రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కంటే తనకు 5 వేల ఓట్లు రూరల్‌లో ఎక్కువగా వచ్చాయని ఆదాల పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్, హోటల్స్, వ్యాపారస్థులు నిన్నటి వరకు హడలిపోతున్నారని.. కాంట్రాక్టర్ గా వచ్చాను కాబట్టే ప్రజా సేవ చేస్తున్నానన్నారు. పోరాటాల్లో నుంచి వచ్చానని శ్రీధర్ రెడ్డి ప్రజలను వేధిస్తున్నాడన్నారు.

ఆదాలపై కోటంరెడ్డి విసుర్లు..

అంతకు ముందు కోటంరెడ్డి సైతం ఆదాల ప్రభాకర్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘పెళ్లి కొడుకుని చేసి పీటల మీద కూర్చోబెట్టి.. పంతులుగారు తాళిబట్టు ఇస్తే... జేబులో‌ పెట్టుకుని పరుగు తీశాడు. టీడీపీ అభ్యర్ధిగా ప్రచారం చేస్తూ గత ఎన్నికల్లో వైసీపీకి వెళ్లిపోయాడు. ఇప్పటికీ ప్రజల్లో ఆదాలపై అనుమానం ఉంది. వేల కోట్ల ఆస్థులున్న మీతో ఢీకొనడానికి నేను సిద్ధం. ఆదాల తాను, తన కుటుంబ సభ్యులు రూరల్‌లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఆయన మాట నిలబెట్టుకోవాలి. అలా చేస్తే నేను ఇకపై ఆరోపణలు చేయను. సజ్జల, మంత్రి కాకాణికి కూడా డౌటున్నట్టు ఉంది. పదే పదే... నెల్లూరు రూరల్ అభ్యర్ధి ఆదాల అని చెబుతున్నారు. నికరంగా పోటీ చేయాలని అనుకుంటే స్పష్టత ఇవ్వాలి. ఆదాల అన్ని పనులు చేయిస్తానని చెప్పారు. అలా చేస్తే సీఎం, ఆదాలకి కృతజ్ఞతలు చెబుతాం. లేదంటే ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తాం’’ అని కోటంరెడ్డి తెలిపారు.

Updated Date - 2023-02-09T13:32:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising