ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP CID : మాజీ మంత్రి నారాయణకు మరోసారి సీఐడీ నోటీసులు.. ఏం జరుగుతుందో..?

ABN, First Publish Date - 2023-10-02T11:20:55+05:30

టీడీపీ నేతలే టార్గెట్‌గా జగన్ సర్కార్ కక్షపూరిత రాజకీయాలకు తెరలేపింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత తర్వాత ఎవర్ని జైలుకు పంపాలనేదానిపై లెక్కలేసుకుంటోంది ప్రభుత్వం..

టీడీపీ నేతలే టార్గెట్‌గా జగన్ సర్కార్ కక్షపూరిత రాజకీయాలకు తెరలేపింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత తర్వాత ఎవర్ని జైలుకు పంపాలనేదానిపై లెక్కలేసుకుంటోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్‌ను అరెస్ట్ చేస్తారని ప్రచారం పెద్ద ఎత్తున వైసీపీ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఇన్నర్ రింగురోడ్డు కేసులో ఏ14గా లోకేష్‌ను చేర్చి ఢిల్లీలో ఉన్న ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్టోబర్-04న సీఐడీ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. నోటీసులు తీసుకున్నాక.. తాను తప్పకుండా హాజరవుతానని, తప్పు చేయనప్పుడు దాక్కోవాల్సిన అవసరం లేదని లోకేష్ చెప్పుకొచ్చారు.


విచారణకు రండి!

ఈ క్రమంలోనే టీడీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు కూడా సీఐడీ నోటీసులు జారీచేసింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ2గా నారాయణ ఉన్నారు. అక్టోబర్-4న విచారణకు రావాలని సీఐడీ సూచించింది. నారా లోకేష్‌తో కలిసే విచారణకు రావాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. వాట్సాప్ ద్వారా ఈ నోటీసులను నారాయణకు సీఐడీ అధికారులు పంపారు.

కాగా.. బెయిల్‌పై నారాయణ బయట ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ సీఐడీ నోటీసులు ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా.. ఇలా నారాయణకు నోటీసులు ఇవ్వడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. అయితే.. ఎల్లుండి నారాయణ, లోకేష్‌లను కలిపి విచారించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ ఇన్నర్ రింగురోడ్డు అక్రమ కేసులో చంద్రబాబును ఏ-01గా చేర్చింది సీఐడీ. మరి.. సీఐడీ విచారణకు నారాయణ వెళ్తారో.. లేదో..? అక్టోబర్-4న ఏం జరుగుతుందో చూడాలి మరి.

Updated Date - 2023-10-02T11:27:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising