ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LokeshYuvaGalam: ఇటుక తయారీ కార్మికులకు లోకేష్ ఇచ్చిన హామీ ఏంటంటే...

ABN, First Publish Date - 2023-03-28T12:37:35+05:30

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 53వరోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శ్రీసత్యసాయిజిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (TDP Leader Lokesh YuvaGalam Padayatra) 53వరోజుకు చేరుకుంది. పెనుకొండ నియోజకవర్గంలో ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. 53వ రోజు గుమ్మయ్యగారిపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్రను ప్రారంభించిన లోకేష్‌ను మల్లాపల్లిలో ఇటుక తయారీ కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను యువనేత (YuvaGalam)ముందు ఏకరువు పెట్టారు. మల్లాపల్లి గ్రామంలో 20 ఇటుక బట్టీలు ఉన్నాయని... వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామన్నారు. చెరువుకుంటలో ఉచితంగా మట్టి తోలుకోవడానికి తమకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఇటుకల బట్టీలకు అవసరమైన బొగ్గునిమిత్తం కట్టెలు కొట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలన్నారు. ఇటుకల బట్టీల వద్ద షెడ్ల నిర్మాణానికి బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి సబ్సిడీ రుణాలు మంజూరుచేయాలని లోకేష్‌కు విన్నవించారు.

యువనేత లోకేష్ స్పందిస్తూ.. నిర్మాణరంగంలో కీలకంగా ఉన్న ఇటుకల తయారీ కార్మికులకు అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇటుకల తయారీని కుటీర పరిశ్రమగా గుర్తించి షెడ్ల నిర్మాణానికి సబ్సిడీ రుణాలు అందిస్తామన్నారు. ఇటుకల తయారీకి అవసరమైన గ్రామీణ చెరువుల్లో మట్టి తోలుకోవడానికి, కట్టెలు కొట్టుకోవడానికి ఉచితంగా అనుమతులు ఇస్తామని లోకేష్ వెల్లడించారు.

Updated Date - 2023-03-28T12:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising