ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP Vs YCP: పుట్టపర్తి అల్లర్లు... ఇరు వర్గాలపై కేసులు.. మండిపడుతున్న టీడీపీ

ABN, First Publish Date - 2023-04-03T10:40:42+05:30

పుట్టపర్తి అల్లర్ల ఘటనపై పోలీసుల యాక్షన్‌లో దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అనంతపురం: పుట్టపర్తి అల్లర్ల ఘటనపై పోలీసుల యాక్షన్‌లో దిగారు. అల్లర్లకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీలపై కేసులు నమోదు చేశారు. పుట్టపర్తి సత్తెమ్మ దేవాలయం దగ్గర జరిగిన అల్లర్లలో 30 యాక్ట్ నిబంధనలు అతిక్రమించారని పోలీసులు అభియోగాలు మోపారు. టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి (TDP Leader Palle Raghunath Reddy)తో పాటు అతని అనుచరులు పది మందిపై, అలాగే వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి (YCP MLA Sridhar Reddy), అతని అనుచరులు పదిమందిపై పుట్టపర్తి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.

పుట్టపర్తిలో నియోజకవర్గంలో పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉన్నప్పటికీ, నిబంధనలు బేఖాతరు చేసి సత్తెమ్మ దేవాలయానికి ఇరుపార్టీల నేతలు చేరుకుని ఘర్షణలకు పాల్పడ్డారని, ఇరువర్గాలు రాళ్లు, చెప్పులతో దాడులకు పాల్పడ్డారని పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. పుట్టపర్తిలో శాంతిభద్రతలు భంగంవాటిల్లితే ఎవరినీ ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయడంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాము గృహనిర్బంధం ఉన్నామని, వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్, ఆ పార్టీ కార్యకర్తలే ముందుగా సత్తెమ్మ దేవాలయానికి వచ్చి 30 యాక్ట్ నిబంధనను ఉల్లంఘించారని చెబుతున్నారు. ఎమ్మెల్యేకు పోలీసులు రెడ్ కార్పెట్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తమపైనే దాడి చేశారని.. తిరిగి తమపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం ఏంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Updated Date - 2023-04-03T10:40:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising