కాపు కాలుష్యం వెదజల్లితే.. నేను చెట్లు పెంచా

ABN , First Publish Date - 2023-07-04T00:25:20+05:30 IST

ప్రస్తుత ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాలుష్యాన్ని సృష్టిస్తుంటే, తాను లక్షలా ది మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడానని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

కాపు కాలుష్యం వెదజల్లితే.. నేను చెట్లు పెంచా

సెల్ఫీ చాలెంజ్‌లో కాలవ

రాయదుర్గం, జూలై 3: ప్రస్తుత ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాలుష్యాన్ని సృష్టిస్తుంటే, తాను లక్షలా ది మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడానని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. తన 50 వారాల సెల్ఫీ చాలెంజ్‌లో భాగంగా తన హ యాంలో పెంచిన చెట్లపై సోమవారం ఆయన 12వ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లు కేంద్రంగా దశాబ్దకాలంగా ఎమ్మెల్యే కాపు వనరుల దోపిడీకి ఒడిగడుతున్నాడ న్నారు. అక్కడ అతడి క్వారీ, క్రషర్ల ద్వారా కాలుష్యానికి కారకుడవుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాడన్నా రు. తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు అక్కడ వేలాది చెట్లు నాటితే అవి పెరిగి ప్రస్తుతం వనాలుగా మారాయన్నా రు. రాయ దుర్గం హరితస్వర్గం పేరుతో మొక్కలు నాటే బృహత్తర యజ్ఞనానికి అప్పట్లో శ్రీకారం చుట్టామన్నారు. ఊరు వాడ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించా మన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లకు ఇరువైపులా ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను నాటడంతో పాటు సంరక్షించామన్నారు. కంకరమిషన్లు, క్వారీ యజమా నులను ఒప్పించి విరివిగా మొక్కలను నాటించానని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే మాత్రం క్వారీ, కంకర మిషన్ల యజమానులతో ప్రతి నెలా లక్షల్లో మామూళ్లు దండుకుంటున్నాడని ఆరోపించారు.

Updated Date - 2023-07-04T00:25:20+05:30 IST