JC Prabhakar: టెన్షన్.. టెన్షన్.. మరోసారి జేసీ నివాసం ముందు పోలీసుల మోహరింపు..
ABN, First Publish Date - 2023-09-25T09:37:39+05:30
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం ముందు మరోసారి పోలీసులు మోహరించారు. జేసీ నివాసం వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్దపప్పురు మండలం తిమ్మనచెరువు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కళ్యాణమండపం పనుల భూమి పూజకు జేసీ ఏర్పాట్లు చేశారు.
అనంతపురం: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy) నివాసం ముందు మరోసారి పోలీసులు మోహరించారు. జేసీ నివాసం వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్దపప్పురు మండలం తిమ్మనచెరువు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కళ్యాణమండపం పనుల భూమి పూజకు జేసీ ఏర్పాట్లు చేశారు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆలయ కమిటీ సిబ్బందితో పాటు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎండోమెంట్ పరిధిలోకి రాదంటూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దేవాలయం పరిధిలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో పలు అభివృద్ధి పనులకు జేసీ ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. దీంతో ఆయన అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున జేసీ నివాసం వద్దకు చేరుకుని గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై జేసీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జేసీ నివాసం వద్ద పోలీసుల మోహరింపుతో అనంతలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Updated Date - 2023-09-25T09:37:39+05:30 IST