Ketireddy Peddareddy: జేసీ అంత పనికిమాలిన ఎదవను ఎవరినీ చూడలేదు
ABN, First Publish Date - 2023-07-08T09:48:59+05:30
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
అనంతపురం: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (Tadipatri Municipal Chairman JC Prabhakr Reddy), తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Tadipatri MLA Ketireddy Peddareddy) మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చీనీ తోటకు పంట భీమా డబ్బులను ఎమ్మెల్యే కేతిరెడ్డి కొట్టాశారంటూ జేసీ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈక్రమంలో జేసీకి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్ విసిరారు. క్రాప్ ఇన్సూరెన్స్ అందరి రైతులకు వచ్చినట్లే తనకూ పంట బీమా వచ్చిందని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదని... కాబట్టి ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అంత పనికిమాలిన ఎదవను ఈ రాష్ట్రంలో తాను ఎవరినీ చూడలేదన్నారు. పుట్లూరు, ఎల్లనూరు మండలాలలో మగాడు అనే వాడు ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తన తోటలో అడుగు పెట్టు చూడు అంటూ సవాల్ విసిరారు. ‘‘నాకు ఎమ్మెల్యే పదవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష. ఈ పదవి లేకపోతే జేసీని ఇంటిలో నుంచి లాక్కుని వచ్చి చెప్పు తీసుకొని కొట్టి తాడిపత్రి పట్టణమంతా తిప్పుతానంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాగా.. ఈరోజు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చీనీ తోటను పరిశీలించడానికి వెళ్తానంటూ జేసీ సవాల్ చేసిన నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చీనీ మొక్కలు నాటిన ఏడాదికే రూ. 13.89 లక్షల పరిహారం అందిందని జేసీ ఆరోపణలు గుప్పించారు. ఇందులో భాగంగా పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే చీనీ తోటను పరిశీలించడానికి వెళ్లాలని జేసీ నిర్ణయించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసు బలగాలు మోహరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
Updated Date - 2023-07-08T09:51:18+05:30 IST