Peddireddy Ramachandrareddy: అనంతలో మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ
ABN, First Publish Date - 2023-09-14T13:05:13+05:30
వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది.
అనంతపురం: వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి (Minister Peddireddy Ramachandra reddy) నిరసన సెగ తగిలింది. సాగునీటి సలహా మండలి సమావేశానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలెక్టరేట్ వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద తెలుగుదేశం నేతలు (TDP Leaders) రిలే దీక్ష చేపట్టారు. అదే సమయంలో ఆ ప్రాంతంలోకి వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌ను చూసి టీడీపీ నేతలు రిలే దీక్షా శిబిరం నుంచి బయటికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన స్పెషల్ పార్టీ పోలీసులు రిలే దీక్షా శిబిరం వైపు దూసుకెళ్లారు. టీడీపీ నేతలకు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Updated Date - 2023-09-14T13:05:13+05:30 IST