ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YuvaGalam Padayatra: పత్తికొండ నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర

ABN, First Publish Date - 2023-04-15T12:18:57+05:30

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ యువనేత నారాలోకేష్ యువగళవారం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళవారం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 71వ రోజు పాదయాత్రను డోన్ నియోజకవర్గం పొలిమేరమెట్ట క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించారు. కాసేపటి క్రితమే డోన్‌ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra) పూర్తై పత్తికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా యువనేతకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పత్తికొండ టీడీపీ ఇన్‌చార్జ్ కేఈ శ్యాంబాబు, కర్నూలు జిల్లా ముఖ్య నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి టీడీపీ యువనేతకు స్వాగతం పలికారు.

పాదయాత్రలో భాగంగా పత్తికొండ నియోజకవర్గం శభాష్‌పురం గ్రామస్తులు లోకేష్‌ను కలిసి సమస్యలను విన్నవించారు. శభాష్‌పురం గ్రామంలో సాగు, తాగునీటి సమస్య అధికంగా ఉందన్నారు. వేసవిలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్, పైప్ లైన్, కుళాయిలు లేకపోవడంతో కిలోమీటరు దూరంలో ఉన్న పొలాల బోర్ల వద్దకువెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో గ్రామంలో బోర్లు వేయించారని.. పైప్ లైన్ వేసేలోపు ప్రభుత్వం మారిపోవడంతో పనులు నిలచిపోయాయని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత ప్రభుత్వం సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వస్తోందన్నారు. పత్తికొండ, తుగ్గలిలో ఎటువంటి పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగులకు పొట్టచేతబట్టుకొని సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలియజేశారు.

యువనేత లోకేష్ స్పందిస్తూ... టీడీపీ ప్రభుత్వ హయాంలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీరు అందించే పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. 30 శాతం పనులు పూర్తయ్యాక ప్రభుత్వం మారిపోయిందని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పథకానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వకుండా పనులు ఆపేశారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ కుళాయి పథకాన్ని పూర్తిచేస్తామన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో సోలార్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-04-15T12:18:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising