ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yuvgalam Padayatra: తాడిపత్రి నియోజవర్గంలోకి లోకేష్ పాదయాత్ర...

ABN, First Publish Date - 2023-04-11T10:17:11+05:30

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అనంతపురం: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఉలికుంటపల్లి విడిది కేంద్రం నుండి 67వ రోజు పాదయాత్ర (YuvaGalam)ను యువనేత ప్రారంభించారు. నేటితో శింగనమల నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి అయ్యింది. తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్ర(Lokesh YuvaGalam) ప్రవేశించింది. ఈ క్రమంలో లోకేష్‌ (Nara lokesh) కు టీడీపీ నేతలు (TDP Leaders)ఘన స్వాగతం పలికారు. జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy), జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy), జేసీ అస్మిత్ రెడ్డి (JC Asmith Reddy), పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తాడిపత్రికి చేరుకుని లోకేష్‌కు పూలమాలతో స్వాగతం పలికారు.

అంతకుముందు ఉలికుంటపల్లి విడిది కేంద్రం వద్ద మహనీయుడు జ్యోతిరావు పూలే జయంతి (Jyoti Rao Phule birth anniversary) సందర్భంగా ఆయన చిత్రపటానికి లోకేష్, టీడీపీ ముఖ్య నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అణ‌గారిన‌వ‌ర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయుని స్మృతిలో నివాళులు అర్పిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. మ‌హిళ‌లు, అట్ట‌డుగువ‌ర్గాల ఆత్మ‌గౌర‌వ పోరాటానికి విద్య‌నే ఆయుధంగా అందించిన పూలే మ‌హాశ‌యుని ఆశ‌యసాధ‌న‌కి కృషి చేయ‌డం మ‌నంద‌రి బాధ్య‌త‌. జై పూలే అంటూ లోకేష్ నివాళి అర్పించారు. మరోవైపు యువగళంకు సంఘీభావంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Former Minister Somireddy Chandramohan Reddy) పాదయాత్రలో పాల్గొన్నారు.

66వ రోజు పాదయాత్ర ఎలా సాగిందంటే...

యువగళం పాదయాత్ర 66వ రోజు శింగనమల నియోజకవర్గం సోడనంపల్లి క్రాస్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. సోడనంపల్లి శివార్లలో గొర్రెల పెంపకందారులను లోకేష్ కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దమట్లగొంది, సలకంచెరువు గ్రామం ప్రారంభంలో కార్యకర్తలు, నాయకులు యువనేతకు ఘ‌న‌స్వాగతం పలికారు. అలాగే లోకేష్‌ను కలిసిన ఎస్సీ కాలనీవాసులు తమ సమస్యలను ఏకరవుపెట్టగా.. టీడీపీ అధికారంలోకి రాగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆపై సలకంచెరువు వద్ద బీసీల ప్ర‌తినిధుల‌తో ముఖాముఖిలో వారి సాధకబాధకాలు విన్నారు. కొరివిపల్లి, ఉల్లికల్లు గ్రామస్తులు పాద‌యాత్ర‌కు సంఘీభావంగా లోకేష్ వెంట నడిచారు.

Updated Date - 2023-04-11T10:17:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising