YuvaGalam: లోకేష్‌ను చూసేందుకు భారీగా రోడ్లపైకి వచ్చిన మహిళలు
ABN, First Publish Date - 2023-03-31T11:32:35+05:30
టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ పాదయాత్ర 56వ రోజుకు చేరుకుంది.
శ్రీసత్యసాయి జిల్లా: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra)56వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం రాప్తాడు నియోజకవర్గం సీకేపల్లి చేరుకున్న లోకేష్‌ను టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. లోకేష్‌ను చూసేందుకు సీకేపల్లి మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి వచ్చారు. అందరినీ కలుస్తూ వారి సమస్యలు యువనేత తెలుసుకుంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అంటూ ఈ సందర్భంగా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం (TDP Government) వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామంటూ హామీ ఇచ్చారు.
కరెంట్ బిల్లు ఎక్కువోచ్చిందని, పెన్షన్లు కట్ చేశారని పలువురు వృద్ధులు ఆవేదన చెందారు. ‘‘మీ పెన్షన్లే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది పెన్షన్లు కట్ చేశారు. మరో ఆరు లక్షల పెన్షన్లు లేపేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధం అవుతుంది. అర్హులైన అందరికీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్లు అందజేస్తాం’’ అని లోకేష్ భరోసా ఇచ్చారు. చిరు వ్యాపారులతో మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అంటూ లోకేష్ హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
కాగా.. నిన్న 55వ రోజు పాదయాత్రలో గుట్టూరు వద్ద 700 కిలోమీటర్ల మైలురాయిని లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతాల తాగు,సాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వం వచ్చాక హంద్రీనీవా కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అక్కడ శిలాఫలకం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కృషితో రాష్ట్రానికి వచ్చిన కియా కార్ల ఫ్యాక్టరీ ఎదుట సెల్ఫీ దిగారు. కియా ఫ్యాక్టరీ వద్ద ఉద్యోగులు, సిబ్బందితో మాట్లాడారు. కియా పరిశ్రమ ముందు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అమ్మనపల్లి వద్ద స్థానికులతో మాటామంతి నిర్వహించారు. గుట్టూరు హైవే సమీపంలో కుంచిటిగ వక్కలిగ సామాజికవర్గీయులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. సీకేపల్లి పంచాయతీ కోన క్రాస్ వద్ద పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశించగా లోకేష్‌కు నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
Updated Date - 2023-03-31T11:32:35+05:30 IST