కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anticipatory Bail: పుంగనూరు, అంగళ్లు కేసులలో టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్

ABN, First Publish Date - 2023-08-28T11:42:11+05:30

పుంగనూరు, అంగళ్లు కేసులలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది.

Anticipatory Bail: పుంగనూరు, అంగళ్లు కేసులలో టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్

అమరావతి: పుంగనూరు, అంగళ్లు కేసులలో టీడీపీ నేతలు దేవినేని ఉమ (Former Minister Devineni Uma), నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (Nallari Kishor reddy), పులివర్తి నానిలకు (Pulivarthi Nani) ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. అయితే పుంగనూరు ఇన్‌ఛార్జి చల్లా బాబుపై (Challa Babu is in charge of Punganur) నమోదైన 7 కేసుల్లో నాలుగింటిలో ముందస్తు బెయిల్ రాగా.. మరో మూడు కేసుల్లో బెయిల్‌ను హైకోర్టు (AP Highcourt) తిరస్కరించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ముగ్గురు కూడా నాలుగు వారాల పాటు అన్నమయ జిల్లాకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఆదివారం కర్నూల్ 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని షరతులు విధించింది. మరోవైపు పుంగనూరు, అంగాళ్లు సంఘటనల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై (TDP Chief Chandrababu Naidu) కూడా కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. తాను ముందస్తు బెయిల్‌కు దాఖలు చేసేది లేదని టీడీపీ అధినేత తేల్చిచెప్పేశారు. తనకి సంబంధం లేకపోయినా తనపై కేసులు నమోదు చేశారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దాడిచేసి తనపైనే కేసులు నమోదు చేశారని చంద్రబాబు, టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-08-28T11:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising