Chandrababu security : ఎన్నికల వేళ చంద్రబాబుకు భద్రతను తొలగించనున్నారా? డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యలు అందుకేనా?
ABN, First Publish Date - 2023-06-08T08:52:33+05:30
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి ఉన్నత పదవిలో ఉన్న వారి నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే.. అది ప్రభుత్వ మాటగానే పరిగణించాలి. నేడు డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం సందర్భం కూడా లేకుండా ఆయన చంద్రబాబు భద్రత గురించి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
తిరుమల : స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి ఉన్నత పదవిలో ఉన్న వారి నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే.. అది ప్రభుత్వ మాటగానే సాధారణంగా పరిగణిస్తూ ఉంటుంది ప్రజానీకం. నేడు ఏపీ డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి (Deputy Speaker Veerabhadra Swamy) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం సందర్భం కూడా లేకుండా ఆయన చంద్రబాబు భద్రత (Chandrababu Security) గురించి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
అసలు వీరభద్రస్వామి ఏమన్నారంటే.. చంద్రబాబుకీ గతంలో బెదిరింపులు వున్నాయని ఇచ్చిన భద్రతని నేటికీ కొనసాగించడం సబబు కాదని స్పీకర్ తమ్మినేని సీతారాం గతంలో చెప్పారని గుర్తు చేశారు. ఇది కేవలం తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitharam) వ్యక్తిగత అభిప్రాయమేమీ కాదని.. రాష్ట్ర ప్రజల్లో చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి పేర్కొన్నారు. సమయం, సందర్భం లేకుండా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల వేళ చంద్రబాబుకి భద్రత తొలిగించేందుకు ఏమైనా ప్రభుత్వం స్కెచ్ గీస్తోందా? అందుకే తమ్మినేని సీతారాం, వీరభద్ర స్వామి వంటి ప్రభుత్వ పెద్దలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-06-08T09:04:18+05:30 IST