AP News: కోడికత్తి కేసు.. పేర్నినాని సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-04-15T18:38:06+05:30
కోడికత్తి కేసుపై మాజీమంత్రి పేర్నినాని (Perni nani) సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాడేపల్లి: కోడికత్తి కేసుపై మాజీమంత్రి పేర్నినాని (Perni nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకే అనుమానం కలుగుతోందని, టీడీపీ (TDP) సానుభూతి పరులు ఏదో ఒక గొడవలు పెట్టుకొని రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి నిందితుడితో చర్చించి వస్తున్నారని ఆరోపించారు. ఒక మహిళా వకీలు పిటిషన్ పెట్టి వెళ్లి నిందితుడితో చర్చిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. తమకే చంద్రబాబుపై అనుమానంగా ఉందన్నారు. లోపల ఏం చేస్తారో వీళ్లు... వీళ్లు ముద్దాయిలను ఏదో రకంగా ఏదో ఒక గొడవతో కావాలని గొడవలు సృష్టించుకుని వెళుతున్నారని ఆరోపించారు. వీరు ఏదో చేస్తున్నారనే అనుమానం తమకు ఉందన్నారు. కోడికత్తి కేసులో జగన్మోహన రెడ్డి కావాలని దాడిచేయించుకున్నారని టీడీపీ వాళ్ళు అంటున్నారని అన్నారు. అయితే అలిపిరిలో చంద్రబాబుపై చేసిన దాడి ఎలాంటిది? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు తీవ్రవాదులకు ఎలా స్లీపర్ సెల్స్ పనిచేస్తాయో అలానే చంద్రబాబుకు స్లీపర్ సెల్స్ పనిచేస్తారని అన్నారు. సీబీఐ, ఎన్ఐఏ అధికారులను వారు ప్రభావం చేస్తున్నారని చెప్పారు. డీఎల్ రవీంద్ర లాంటి వారితో జగన్‌పై విషం చిమ్మిస్తున్నారని మండిపడ్డారు. ఎన్‌ఐఏ అధికారులు వేసింది బలహీనం అయిన చార్జి షీట్ వేశారని పేర్కొన్నారు. ఆకత్తి ఎయిర్ పోర్టులోకి ఎలా వచ్చిందో చెప్పలేదన్నారు. ఇది ధర్మబద్ద మయిన విచారణా? అని ఆయన ప్రశ్నించారు.
Updated Date - 2023-04-15T18:38:06+05:30 IST