ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP Lokesh : కేంద్రాన్ని చూసి జగన్‌ గడగడ!

ABN, First Publish Date - 2023-02-03T03:42:02+05:30

ఎన్నికలకు ముందు ఒక్క అవకాశమిస్తే కేంద్రాన్ని గడగడలాడించి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న జగన్‌.. ఇప్పుడు కేంద్రాన్ని చూసి గడగడలాడిపోతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఎద్దేవాచేశారు. ప్రధాని మోదీ వస్తే కాళ్లు పట్టుకోవడానికి ఆరాటపడుతున్నాడని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోదీ వస్తే కాళ్లు పట్టుకునేందుకు రెడీ

సీబీఐ కేసుల కోసం వంగి వంగి..

గద్దెనెక్కాక ఒక్క కంపెనీనీ తీసుకురాలేదు

జే ట్యాక్స్‌ కట్టలేక ఉన్నవీ పోతున్నాయి

క్రిమినల్‌ సీఎం.. జిల్లాకో క్రిమినల్‌ తయారీ

మంత్రి పెద్దిరెడ్డి మారుపేరు వీరప్పన్‌

పాదయాత్రలో లోకేశ్‌ ధ్వజం

లోకేశ్‌ ప్రచార రథం సీజ్‌

పలమనేరులో పోలీసుల అత్యుత్సాహం

(చిత్తూరు-ఆంధ్రజ్యోతి/పలమనేరు)

ఎన్నికలకు ముందు ఒక్క అవకాశమిస్తే కేంద్రాన్ని గడగడలాడించి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న జగన్‌.. ఇప్పుడు కేంద్రాన్ని చూసి గడగడలాడిపోతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఎద్దేవాచేశారు. ప్రధాని మోదీ వస్తే కాళ్లు పట్టుకోవడానికి ఆరాటపడుతున్నాడని అన్నారు. 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లి మెడలు వంచుతానని.. ఇప్పుడు సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీ వెళ్లి తన మెడలు వంచుతున్నాడని ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్ర ఏడో రోజు గురువారం చిత్తూరు జిల్లా పలమనేరులో సాగింది. పట్టణంలో ఆయన్ను చూసేందుకు జనం భారీఎత్తున తరలివచ్చారు. దీంతో ప్రచార రథంపైకి ఎక్కి మాట్లాడారు. ‘ఎన్నికలకు ముందు జగన్‌ ఉద్ధరిస్తానంటే అందరూ నమ్మేశారు. రాష్ట్రంలోని కంపెనీలన్నీ జే ట్యాక్స్‌ కట్టలేక పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. రాయలసీమ ప్రాంతంలో కీలకమైన డ్రిప్‌ ఇరిగేషన్‌ను అటకెక్కించాడు. కార్మికులు వలసలు పోతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అన్నారు. 2019కి ముందు తనపై ఒక్కకేసు కూడా లేదని.. జగన్‌ సీఎం అయ్యాక ఏకంగా 19 కేసులు పెట్టారని తెలిపారు. ‘యువగళం ఆపేందుకు జీవో 1 తెచ్చారు. దానిని ఎక్కడైనా మడిచి పెట్టుకోమని చెప్పా. ఈ భూమ్మీద నేను, జగన్‌రెడ్డి శాశ్వతం కాదు. ఈ రాష్ట్రం శాశ్వతం. జగన్‌ పాలనతో రాష్ట్రం 67 ఏళ్లు వెనక్కి వెళ్లింది. రాష్ట్ర భవిష్యత్‌ కాపాడుకునేందుకు అందరూ ముందుకు రండి. యువగళంతో మీ గళం కలపండి’ అని లోకేశ్‌ పిలుపునిచ్చారు. ‘సైకో క్రిమినల్‌ జగన్‌, మరికొంతమంది క్రిమినల్స్‌తో కలిసి తాడేపల్లిలో ఉంటున్నాడు. జిల్లాకో క్రిమినల్‌ను తయారు చేస్తున్నాడు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి క్రిమినల్‌’ అని లోకేశ్‌ ధ్వజమెత్తారు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ పెద్దిరెడ్డి బినామీయేనని దుయ్యబట్టారు.

పలమనేరులో పసుపు ప్రభంజనం

పలమనేరులో లోకేశ్‌ పాదయాత్రకు జనం పోటెత్తారు. ఇక్కడి క్లాక్‌ టవర్‌ వద్ద నిర్వహించిన సభ ప్రజలతో కిక్కిరిసిపోయింది. జనసందోహాన్ని చూస్తుంటే నోట మాట రావడం లేదని లోకేశ్‌ అన్నారు. ఆయన్ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చిన్నా పెద్దా తేడా లేకుండా తరలివచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన ఏ టీడీపీ కార్యక్రమానికీ ఈ స్థాయిలో జనం రాలేదు. కురప్పల్లి క్రాస్‌ వద్ద 200 గుమ్మడికాయలతో లోకేశ్‌కు దిష్టి తీసి, యాత్ర విజయవంతం కావాలని స్థానికులు ఆశీర్వదించారు.

ప్రచార రథం సీజ్‌

చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించకుండా జీవో 1 పేరిట అడ్డుకున్న ఘటన మరువకముందే.. అదే జీవోను చూపుతూ పోలీసులు పలమనేరులో లోకేశ్‌ ప్రచార రథాన్ని సీజ్‌ చేశారు. మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో జరిగిన బహిరంగసభకు జనం భారీగా తరలిరావడంతో లోకేశ్‌ ప్రచార రథమెక్కి ప్రసంగించారు. అనంతరం పోలీసులు ప్రచార రథాన్ని సీజ్‌ చేశారు. అనుమతుల్లేకపోవడంతోనే వాహనాన్ని సీజ్‌ చేయాల్సి వచ్చిందని చిత్తూరు దిశ డీఎస్పీ బాబూ రాజేంద్రప్రసాద్‌ చెప్పారు. వాహనంపై నిల్చుని మాట్లాడకూడదని రాజ్యాంగంలో ఎక్కడుందో చెప్పాలని లోకేశ్‌ ప్రశ్నించారు. తన వాహనాన్ని విడుదల చేసే వరకు ఒక్క అడుగు ముందుకు వేయనంటూ అక్కడే నిలబడిపోయారు. పావుగంట తర్వాత పోలీసు అధికారులు దిగివచ్చారు. ప్రచార రథాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కాగా.. పలమనేరులో బహిరంగ సభకు అనుమతి లేదన్నా ప్రచార రథాన్ని ఉపయోగించారని, 24 గంటల్లో సమాధానం ఇవ్వాలంటూ అమరనాథ్‌రెడ్డికి పోలీసులు నోటీసులివ్వడం గమనార్హం.

16.2 కి.మీ. నడక

గురువారం కాస్త ఆలస్యంగా ఉదయం 11 గంటలకు లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభించారు. తొలుత ఆయన ఆర్యవైశ్యులతో సమావేశమయ్యారు. వారి కార్పొరేషన్‌ను క్రియాశీలం చేస్తానని హామీ ఇచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ప్రతినిధులు, న్యాయవాదులు, పట్టు రైతులు, టమోటా రైతులు కూడా ఆయన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. గురువారం 16.2 కిలోమీటర్లు నడిచిన ఆయన.. సాయంత్రానికి పలమనేరు నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తిచేసుకుని పూతలపట్టు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. శుక్రవారం బంగారుపాళ్యం మండలంలో నడక సాగిస్తారు.

మీ అరాచకత్వానికి అంతూపొంతూ లేదా?

పలమనేరు నియోజకవర్గంలో 4రోజుల పాటు పాదయాత్ర ముగించుకుని పూతలపట్టు నియోజకవర్గంలో అడుగుపెట్టాను. పలమనేరు నియోజకవర్గ ప్రజలు, కుటుంబ సభ్యుడి మాదిరి నాపై చూపిన అభిమానానికి కృతజ్ఞుడిని. టవర్‌ క్లాక్‌ సెంటర్‌లో జరిగిన సభకు హాజరైన జన ప్రవాహాన్ని చూశాక సైకో పాలనపై రాష్ట్ర ప్రజలు ఎంతగా విసిగిపోయారో అర్థమైంది. ఆర్యవైశ్యులతో ఈ రోజు సమావేశమయ్యాను. జగన్‌ సీఎం అయ్యాక జె-ట్యాక్స్‌ కట్టలేక వ్యాపారాలు వదులుకుంటున్నామని వాపోయారు. తమకు గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన కిలోకు రూ.50 ప్రోత్సాహకాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం నిలిపేసిందని పలమనేరులో పట్టురైతులు చెప్పారు. నీ నిర్వాకం కారణంగానే కదా రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది! ఉరికొయ్యలకు వేలాడిన రైతన్నల ఉసురు నీకు తగలదా జగన్‌? పలమనేరు కోర్టు సమీపంలో న్యాయవాదులు కలిశారు. న్యాయవాదుల కోసం కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే వెంకటేగౌడ ఎవరికీ చెప్పకుండా అమ్ముకున్నాడని వాపోయారు. ఒంటెత్తు పోకడలతో.. ప్రశ్నించే గళాలను అణచివేస్తున్న సైకో సీఎంకు చెప్పేది ఒక్కటే. హిట్లర్‌, ముస్సోలినీ వంటి కరుడుగట్టిన నియంతులే చరిత్రహీనులుగా మారి కాలగర్భంలో కలసిపోయారు. నువ్వొక లెక్కా? అధికారమదంతో ఎంత అరాచకం సృష్టించినా ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం ప్రజలదే.

Updated Date - 2023-02-03T04:04:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising