ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchannaidu: ఇంకా కేసులు పెట్టి ఏం పీకుతారు?

ABN, First Publish Date - 2023-11-17T10:09:26+05:30

రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ కన్నా వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువగా ఉందని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ కన్నా వైసీపీ ప్రభుత్వం (YCP Government) పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువగా ఉందని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైపల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై (Former MLA Dhulipalla Narendra) అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై (TDP Leaders) వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారని.. ఇంకా కేసులు పెట్టి ఏం పీకుతారు? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాడిరైతుల ప్రగతికి కృషి చేసే నరేంద్ర.. రైతులపైనే దాడి చేయించారంటే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. సంఘం డెయిరీని అక్రమించుకోవాలని ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసిందన్నారు. అది ఫలించకపోవడంతోనే దింపుడు కళ్ళం ఆశలా రైతులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) కోసం ఆత్మాహుతికి పాల్పడే నాయకులు, కార్యకర్తలు టీడీపీ సొంతం. అలాంటి వారు అక్రమ హత్యాయత్నం కేసులకు భయపడతారా జగన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy). మీకు ఇంకా 5 నెలలే ఉంది ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్పి రాష్ట్రం నుంచి తన్ని తరుముతారు’’ అంటూ అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Updated Date - 2023-11-17T10:09:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising