ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gidugu Rudraraju: సీఎం జగన్‌కు విజ్ఞప్తి.. ప్యాలస్ విడిచి జనంలోకి రావాలి

ABN, First Publish Date - 2023-10-28T12:07:02+05:30

ముఖ్యమంత్రి జగన్‌కు విజ్ఞప్తి ప్యాలస్ విడిచి జనంలోకి రావాలి అంటూ ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్‌కు (CM Jagan) విజ్ఞప్తి ప్యాలస్ విడిచి జనంలోకి రావాలి అంటూ ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు (APCC Chief Gidugu Rudraraju) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పొలాలు ఎడారులుగా మారుతున్న పరిస్థితి నెలకొందని.. ముఖ్యమంత్రి పొలం బాట పట్టాలని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితి వలన పొలాలు ఎండిపోయి రైతులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. పంట నష్టపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి కరువు మండలాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా లక్ష ఆర్ధిక సాయం అందజేయాలన్నారు. పంట ఎండిపోయిన పొలాల రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కేంద్రం మెడలు వంచి హోదా తీసుకువస్తామని చెప్పి, కేంద్రం ముందు సాగిలా పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం అమలైతే హోదాతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు వస్తాయన్నారు. రైతులను, ఆక్సిడెంట్ బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాస్తున్నామననారు. ఓబీసీ కులగణనపై రేపు గుంటూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూడా ఓబీసీ కులగణనపై సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సమావేశాలకు ఏపీసీసీ, ఏఐసీసీ నాయకులు పాల్గొంటారని గిడుగు రుద్రరాజు వెల్లడించారు.

Updated Date - 2023-10-28T12:07:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising